"Returned Home": Rajinikanth shares good news with Fans అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్న సూపర్ స్టార్

Rajinikanth discharged from hospital after carotid surgery shares picture from home

Rajinikanth, hospital, Chennai, Rajinikanth discharged, Kauvery hospital, Apollo hospital, Fans, Good news, Twitter, carotid artery revascularisation surgery, carotid surgery, Dadasaheb Phalke Award, Kauvery hospital, Kollywood, Movies, Entertainment.

Actor Rajinikanth shares a good news with fans saying that he had "Returned home", along with a Picture in his Twitter account. The 70 year-old Tamil Superstar recently underwent a surgery to restore blood supply to the brain, was discharged from the hospital tonight.

అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్న సూపర్ స్టార్

Posted: 11/01/2021 03:41 PM IST
Rajinikanth discharged from hospital after carotid surgery shares picture from home

దక్షిణాధి సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ర‌జ‌నీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. తాను ఇంటికి చేరుకున్న విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. చికిత్స పూర్తైంది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ నుండి తిరిగి వ‌చ్చాక ర‌జ‌నీకాంత్‌కి కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న కావేరి ఆసుప‌త్రిలో(Kaveri Hospital) అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు.దీంతో ర‌జనీకాంత్ శ‌స్త్ర చికిత్స‌కు ఓకే చెప్ప‌డంతో క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కులైజేష‌న్ శ‌స్త్ర చికిత్స విజ‌యవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల పాటు హాస్పిట‌ల్‌లోనే రెస్ట్ తీసుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. త‌లైవా న‌టించిన అన్నాత్తె చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. తెలుగులో పెద్ద‌న్న పేరుతో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles