తెలుగు చిత్రసీమ గేయరచనలో తనకంటూ ఓ నిత్యనూతన ఠావును లిఖించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అన్న వార్త టాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాధాన్ని నింపింది. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తన కలంతో ఆయన జాలువార్చిన పదాలతో తన లోతైన భావనలను.. పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యేలా రచించిన గేయాలు తెలుగువారి మదిలో గూడుకట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు.
20 మే, 1955న ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి సీవీ యోగి వేదపండితుడు, తల్లి అమ్మాజి గృహిణి. సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం అయింది. అందులో చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ సీతారామశాస్త్రికి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం సిరివెన్నెల. 1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టిన సీతారామశాస్త్రి.. ఆ చిత్రంలోని పాటలన్నింటికీ ప్రాణం పోశారు. తన పదాల కేళిలో అనేక గేయాలకు రూపకల్పన చేసిన ఆయన తన కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు సిరివెన్నెల.
‘‘విరంచినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం..’’ అన్న.. ‘‘ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా.. గానం పుట్టుక గాత్రం చూడాలా.?’’ అన్న ఆయన పదాల ఝరిలోంచి ఉద్భవించిన పాటలు.. పల్లవి చరణాలుగా మారి.. గేయాలకు ప్రాణాన్ని పోశారు. తన మొదటి సినిమా సిరివెన్నెలనే తన ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు. అలా మొదలైన సీతారామశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి.
1993లో వచ్చిన గాయం చిత్రంలో తనలోని మరో కోణాన్ని కూడా అవిష్కరింపజేసిన సీతారామశాస్త్రీ.. తాను మధురమైన గేయాలే కాదు.. ‘‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం’’ అంటూ కూడా రాయగలనని చాటారు. సినీ సాహిత్యరంగంలో ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పదాల ఝరిలో ఒలలాడుకున్న సీతారామశాస్త్రి.. తెలుగు సినీకళామతల్లిని తన గేయాలతో అలరింపజేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more