తెలుగు సినీకళామతల్లి ముద్దుబిడ్డ ప్రముఖ నటుడు బాలయ్య(92) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సినీకళామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు సినీకళామతల్లికి సేవ చేసుకునేందుకు ఆయన రంగ ప్రవేశం చేసినా ఆయనలోని నైపుణ్యాని ఎరిగిన కళామతల్లి, వాటిని ప్రేక్షకులకు పరిచయం చేయించి ముద్దబిడ్డగా తీర్చిదిద్దింది.
కెరీర్లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు బాలయ్య. పుట్టినరోజు నాడే చనిపోవటం బాధాకరమైన విషయం. గుంటూరు జిల్లా వైకుంఠపురం(అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించారు బాలయ్య. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు. మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించారు. 1958లో 'ఎత్తుకు పై ఎత్తు' సినిమాలో నాయక పాత్ర వేశారు బాలయ్య. తరువాత 'భాగ్యదేవత', 'కుంకుమరేఖ' చిత్రాల్లో నటించారు.
ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'భూకైలాస్' చిత్రంలో శివునిగా కనిపించి మెప్పించారు. ఆ తరువాత 'చెంచులక్ష్మి', 'పార్వతీకల్యాణం' నుంచి నేటి వరకు 300లకు పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి 'నేరము-శిక్ష', 'అన్నదమ్ముల కథ', 'ఈనాటి బంధం ఏనాటిదో' (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'చెల్లెలి కాపురం' చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి నంది పురస్కారాన్ని బహుకరించింది. ఆయన స్వీయ దర్శకత్వంలో 'పోలీస్ అల్లుడు' (1994), 'ఊరికిచ్చిన మాట' (1981) నిర్మించారు. మొత్తంగా పలు చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన ఆయన కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు.
నందమూరి బాలకృష్ణ సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య మృతి పట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్త విన్న బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ‘సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more