గతంలో ఆయన పేరు వింటేనే .. తెలంగాణ ఉన్న రాళ్లు అన్ని రోడ్డు పైకి వచ్చేవి. ఆయన తండ్రి మరణించిన తరువాత తన హవా చాటుకోవాటానికి ఓదార్పు యాత్ర పేరుతో .. తండ్రి పై అభిమానం చూపిన వారిని కలుసుకోని వారిని ఓదార్చుటానికి బయలుదేరిన వ్యక్తికి మొదట తెలంగాణలో చేదు అనుభవం అయిన విజయం తెలిసిందే. అంటే జగన్ తెలంగాణకు వ్యతిరేకమని భావించి, అప్పట్లో జగన్ పై రాళ్ల వర్షం కురిపించారు తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వారి దెబ్బలకు భయపడి.. జగన్ ఓదార్పు యాత్రను రూటు మార్చి.. కొంత సమయం తీసుకున్నాడు జగన్.
జగన్ నాయకత్వంలో కూడా తెలంగాణలో కొంత మంది నాయకులు ఉన్నారు. వారి తరుపున జగన్ అనేక సార్లు టీఆర్ఎస్ పార్టీని మాటల యుద్దంతో ఎదుర్కున్నాడు. జగన్ కు తెలంగాణలో ముఖ్య నాయకురాలు కొండ సురేఖ. ఆమె అండతో జగన్ తెలంగాణ యాత్ర చెయ్యలాని ఎన్నో సార్లు ప్రయత్నించిన టీఆర్ఎస్ పార్టీ నాయకలు , కేసిఆర్, హారీష్ రావు, కేటిఆర్, కవిత లాంటి నాయకులతో గెలవలేక పోయాడు జగన్ . అయితె ఎలాగైన తెలంగాణలో యాత్ర చెయ్యలనేది జగన్ కోరిక. ఆ కోరిక ఇన్నిరోజులు ఫలించింది.
జగన్ కొత్త ఆయుధంతో తెలంగాణలో అడుగు పెట్టడు. అదే జగన్ కొత్త ఆయుధం రైతు దీక్ష. తెలంగాణలో రైతు దీక్ష పేరు జగన్ తెలంగాణలోకి వస్తుంటే .. గతంలో మాదిరి కాకుండా సరికొత్త పూల వర్షం కురిపించారు తెలంగాణ ప్రజలు , టీఆర్ఎస్ పార్టీ నాయకులు. జగన్ అడుగులకు మడుగులు ఎత్తుతూ ... జగన్ అన్న జై అంటూ .. నినాదంతో .. తెలంగాణలో మారుమ్రోగిపోయిందట. నిజామాబాద్‌లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్య క్షుడు జగన్ చేపట్టిన దీక్షపై టిఆర్‌ఎస్ అధినేత, ఆయన కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారని కొన్ని పార్టీలు గోల చేస్తున్నాయి. దీని వెనుక గల ఆంతర్యం ఏమిటో వెల్లడించాలని టీడీపీ కృష్ణా జిల్లా అధ్య క్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.
జగన్ తెలంగాణలో చేస్తోన్న దీక్షకు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల మద్దతు ఉం దని, జగన్ వద్ద కోట్ల రూపా యలను తీసుకుని మౌనంగా ఉండిపోయారని ఆరో పించారు. గతంలో హైదరా బాద్‌లో నిర్వహించిన ఫీజు పోరులో కూడా ఇదే తర హాలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు భారీగా సొమ్ములు ముట్టాయని విమర్శించారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఉద్యమాలు నిర్వహిస్తూ, జగన్ రైతుల పేరిట మొసలి కన్నీరు కారుస్తు న్నారన్నారు.
రైతు దీక్ష పేరిట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధి నేత వైఎస్ జగన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చేపట్టిన దీక్ష రెండవరోజు అట్టర్‌ప్లాప్ అయిందట. జగన్ అనుచరుల అంచనాల మేరకు మొదటి రోజు 25 వేల మంది రైతులను సమీకరించాలని భావించగా 6 నుండి 8 వేల వరకు మాత్రమే రైతులు వచ్చారని ఆ పార్టీ నేతలు అంచనాకు వచ్చారట. రెండవ రోజు పరిస్థితి మరింత దయనీయంగా కనిపించింది. రైతు సమస్యలపై సర్కారును తట్టిలేపు తానని శపథం చేసిన జగన్ స్థానిక రైతాంగాన్ని కదిలించలేకపోయారట.
రైతులు లేక సభా ప్రాంగణం వెలవెల పోవ డంతో నేతలు ఆందోళనకు గురయ్యారట. చివరికి మహిళలు, ఇత రులను, కార్యకర్తలను వేదికపైకి పంపించి సందడి చేశారట.అయితే ప్రతికూల వాతావరణంలో తెలంగాణాలో జగన్ అడుగు పెట్టారన్న సంతృప్తి మాత్రం ఆ పార్టీకి మిగిలినట్లైందని. సభను విజయవంతం చేసుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర బాధ్యులు, ముఖ్య నేతలు స్థానికేతరులను రంగంలోకి దింపారట. స్థానిక కార్యకర్తల సందడి కంటే ఇతర జిల్లాల నాయకులు, కార్యకర్తలు హంగామానే ఎక్కువుగా ఉందట.
అయితే జగన్ ధీక్షకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని భావించి టీడిపి పార్టీ విరుచుకుపడింది. తెలంగాణలో చంద్రబాబు పర్యటన చేస్తుంటే అనేక రోజుల పాటు గొడవ చేసిన కేసీఆర్, కోదండరాంలు జగన్ రైతు దీక్ష చేస్తుంటే నోళ్లూ మూతబడ్డాయా? ఆ పార్టీ నేతలు మండిపడ్డారని తెలిసిన విషయమే.
మొత్తం మీద కేసిఆర్, కేటిఆర్,వైఎస్ఆర్ పార్టీలు కలిసి పోయాయని ప్రజలందరికి తెలుస్తుంది. గతంలో రాళ్ళు .. ఇప్పుడు బంతిపువ్వులు. ‘‘ పూలు అమ్మిన చోటు కట్టలు అమ్మినట్లు’’గా జగన్ కొత్త సామెతన్ పుట్టించాడు. ‘‘ రాళ్లు విసిరిచేతులే ... పూలు విసురుతాయాని ఝజువు చేశాడని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more