దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశం మొత్తాని కీ ఆసక్తికరంగా మారాయి. ప్రతి రాజకీయ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించి హోరాహోరీ పోరాడేందు కు ఎత్తులకు పైఎత్తులు వే స్తూ వ్యూహాలు రచిస్తున్న వైనం సామాన్యులకు కూడా ఆసక్తిని కలిగిస్తున్నది. నేరస్థులు, రాజకీయాలు, కులతత్వం కలగలిసిపోయిన ఆ రాష్ట్రం లో ఎన్నికలలో గెలుపు సాధించడం అంత తేలికేమీ కాదు. అందుకే హేమాహేమీలంతా బరిలోకి దిగారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం అది పెద్ద రాష్ట్రం కావడమే కాదు భావి ప్రధానిగా ప్రచారం పొందుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, గాంధీ-నెహ్రూ వంశస్థుడు రాహుల్ గాంధీ వాటి పట్ల అమితాసక్తిని ప్రదర్శిస్తుండడమే. కేవలం ఆసక్తితో వూత్రమే సరిపెట్టుకోకుండా అంతా తానై ఆయన పార్టీని ఎన్నికలలో నడిపించేందుకు నడుం బిగించడమే. ఉత్తరప్రదేశ్ మీద దృష్టి కేంద్రీకరించిన రాహుల్ గత రెండేళ్ళగా ఆ రాష్ట్రంలో తిరుగుతూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తూ వచ్చారు. అందులో భాగంగానే అధికారంలో ఉన్న బీఎస్పీని ఎదుర్కొనేందుకు ఆయన ప్రధానంగా దళితులపై దృష్టి సారించి, వారితో కలిసే ప్రయత్నం చేశారు. భట్టా పర్సోల్ వంటి ప్రాం తంలో రైతాంగ సమస్యలపై పోరాటం చేశారు.
మాయావతి అవినీతి గురించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ఎంత వరకూ కలిసొస్తాయన్నది ఓటర్లే నిర్ణయిస్తారన్నది వాస్తవమే అయినా ఆయన ఎన్ని కోణాల నుంచి అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారో ఈ ఉదంతాలు చెబుతాయి. పార్టీలో అభ్యర్ధుల ఎంపిక నుంచి పొత్తుల వరకూ సర్వం తానై నడిపిస్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికలలో సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకునేం దుకు ఆ పార్టీ అధ్యక్షుడితో రెండు నెలల పాటు మంతనాలు సాగించి కుదరక ఒంటరిగానే పోరాటం చేయాలని నిర్ణయించిన రాహుల్ ఈసారి ఆరెల్డీ మినహా ప్రధాన పార్టీలు వేటితోనూ పొత్తులు లేకుండా పోటీ చేసేందుకు పార్టీని సమాయత్తం చేశారు.తల్లి పార్టీ అధ్యక్షురాలు కావడం, తనను భావి ప్రధానిగా పార్టీ చూస్తున్న నేపథ్యంలో ఆయన స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారన్నది వాస్తవం. కాంగ్రెస్ నాయకులకు నెహ్రూ- గాంధీ కుటుంబం పట్ల ఉన్న విధేయతే ఆయనకు పెద్ద బలం. ఒక వేళ ఈ ఎన్నికలలో రాహుల్ విజయాన్ని సాధించగలిగితే పార్టీలో ఇక ఆయన కు తిరుగుండదన్నది వాస్తవం.
రాహుల్ గాందీ ఆశలు అన్నీ యూపి మీదే ఉన్నాయి. రాహుల్ కు పోటిగా ములయం సింగ్ యాదవ్ కొడుకు కూడా బరిలోకి దిగుతున్నడట. యూపి ఎన్నికలు భవిష్యతును తెలుపుతాయాని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more