ఆయన పేరు వింటేనే అన్ని పార్టీల వారి గుండెళ్లో సునామి పుడుతుందట. ఆయన చేయ్యి ఎత్తితే పి.ఏ కు చెంప పగులుతుంది. ఆయన బయటి వస్తున్నాడంటే.. అధికారులు, పోలీసులు సైతం కనిపించకుండా పోతారు. ఆయనకు కాంగ్రెస్ లో ప్రత్యేకమైన చరిత్ర ఉందట. ఆయన పేరు లేఖల రావు అని కూడా అంటారు. ఆయన ఒక మంత్రి పదవి లో ఉన్న ఆయన తలచుకుంటే .. ఎలాంటి మీద అయిన లేఖ రాయగలడు. ఆయన సీఎంను సైతం లెక్క చేయకుండా ముందుకు పోగలడు. ఆయన తలచుకుంటే ఎలాంటి వారికైన శంకరగిరి మాన్యలు పట్టించగలడు. ఆయన మంత్రిగానే ఉంటూ తన పార్టీలోని నాయకులకు కూడా లేఖాస్త్రం చేయగలడు. ఆ మంత్రి బయట అడుగు పెడితే ఒక సంచలనమే జరిగినట్లుగా ఉంటుందట.
రాష్ట్ర మంత్రి శంకర్రావు మరో సంచలనానికి తెరలేపారు. ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఏఐసీసీ అద్యక్షురాలు సోనియాగాంధీకి 9 పేజీల లేఖను రాసారట. పేద ప్రజల పక్షాన నిలబడినందుకు తనపై హోంమంత్రి అనుచరులతో పాలు, స్ధానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులు తనపై దాడిచేశారట. ఇదిలా ఉంటే మరో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సలు పరామర్శించారని, నా పై దాడి జరిగిన తనను పరామర్శించలేదని లేఖలో పేర్కొన్నారట. తనపై దాడి చేసిన వారు 22 మంది ఉన్నా, కేవలం నలుగురిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసారని లేఖలో వివరించారట తనపై దాడిజరిగినందుకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన నాయకులు తీవ్రంగా స్పందించారన్నారట దాడి సంఘటనపై పలువురు రాష్టప్రతి ప్రతిభాపాటిల్, గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, డీజీపీకి పలు విజ్ఞాపన పత్రాలను అందజేశారట. రాష్ట్రంలో కేవలం రెడ్డి సామాజిక వర్గం కేవలం మూడు నుంచి నాలుగుశాతమే ఉన్నారని, మీ అద్యక్షతన ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు కాంగ్రెస్‌పార్టీ వెంటే ఉన్నారని శంకర్రావు తన లేఖలో వివరించారట.
దేశంలో అన్నీ రాజకీయ పార్టీలతోపాటు అన్నీ ప్రాంతాలు 2014లో రాహుల్ ప్రధాని అవుతారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారట. ఇదిలాఉంటే తనపై లాఠీలు, కోడిగుడ్లు, రాళ్ళు, టొమాటోలతో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. కాగా నెహ్రూ, గాంధీ కుటుంబాల దయతో తనకు ఇప్పటికీ 7సార్లు టిక్కెట్టు లభించిందని, ఇటువంటి సమయంలో బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ దూరం కాకుండా ఉండాలంటే పార్టీ ప్రతిష్టతోపాటు, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శంకర్రావు అభిప్రాయపడ్డాతున్నారు. రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేయూత నిచ్చిందన్నారు. గతంలో చేనేతకు రూ.50 కోట్ల బడ్జెట్ ఉండగా తనహయాంలో రూ.297 (2011-12) కోట్లకు ఈ ఆర్ధిక సంవత్సరానికి కేటాయించామన్నారు.
తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్యకు హోంమంత్రి సబితా రెడ్డి ఫాంహౌజ్ నుంచి ప్రణాళికలు రూపొందించారని,, హోంమంత్రి, ఆమె కుమారుడు కార్తీకరెడ్డి పలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని శంకర్రావు లేఖలో వివరించారు. అంతేకాకుండా అమాయకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేసారన్నారు. భాను కూడా పేరుమోసిన నేరస్తుడని శంకర్రావు లేఖలో వివరించడం కొసమెరుపు. ఏదీ ఏమైన హోంమంత్రి సబిత రెడ్డిని మాత్రం మంత్రి శంకర్రావు వదలటంలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. శంకర్రావు సబితా రెడ్డికి పెద్ద తల నొప్పిగా మారాడని ప్రజలు అనుకుంటున్నారు. అరుందతి సినిమా బొమ్మలిని వెంటాడినట్టు సబిత రెడ్డిని శంకర్రావు ఆగోరా లాగా వెంటాడుతున్నాడని హోంమంత్రి సన్నిహితులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more