మహిళలు అందాం ఏమైన చేస్తారు? తమ శరీరంలోని అందామైన భాగాలు కోసం అనేక మంది మహిళలు ఆస్పత్రిని సైతం ఆశ్రయిస్తుంటారు. తమ అందంతో ఎదుటి వారిని మెప్పించాలా ఉండాలని తన శరీరంలో భాగాల కొత్త మెరుగులు దిద్దుతుంటారు. అలాంటి వారికి అవి కృత్రిమ అందాలను తెచ్చిపెడుతుంటాయి . వాటి వలన తమ ప్రాణాలు ముప్పువుందన్న సంగతి వారికి తెలియదు. ఇప్పుడు కొన్ని దేశాలలోని మహిళలకు అలా ముప్పు వచ్చిపడిందని చెబుతున్నారు.
ఎరక్కబోయి ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు ఇరుక్కుపోయాం అంటూ గల్ఫ్ మహిళలు ఉలిక్కి పడుతున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికో.. భర్తలు/ కాబోయే భర్తల కోరికకు అనుగుణంగానో కృత్రిమ వక్షోజాలను అమర్చుకొన్న గల్ఫ్ మహిళలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అదెక్కడ తమ ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందోనని భయపడుతున్నారు. తొలగించండి మహాప్రభో అంటూ ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో సౌదీ ప్రభుత్వం ఏకంగా ఓ ప్రత్యేక హాట్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేసింది. రూ. 5 లక్షల ప్రభుత్వ ఖర్చుతో వీరి కృత్రిమ వక్షోజాలు తొలగించేందుకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తోంది.
వక్షోజాల పరిమాణం తక్కువగా ఉన్నవారు వాటిని పెంచుకోడానికి ప్రత్యేకంగా సిలికాన్ ఇంప్లాంట్లను అమర్చుకోవడం తెలిసిందే. బెలూన్ల తరహాలో ఉండే వీటిని శస్త్రచికిత్స ద్వారా లోపల అమరుస్తారు. దీనివల్ల వక్షోజాలు అంతకు ముందున్న వాటికంటే పెద్దగా కనిపిస్తాయి. శారీరకంగా అందంగా కనిపించడానికో.. లేదా భర్తల కోరికకు అనుగుణంగానో వక్షోజాలు పెద్ద పరిమాణంలో ఉండాలని అరబ్బు మహిళలు కోరుకుంటారు. ఇందుకోసం స్థానికంగా ఉండే ప్రైవేటు ఆస్పత్రులలో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేస్తారు.
అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి కృత్రిమ వక్షాలను దిగుమతి చేసుకుని వాటిని వీరికి అమర్చేవారు. ముఖ్యంగా.. ఫ్రాన్స్‌కు చెందిన పోలీ ఇంప్లాంట్ ప్రోతీస్ అనే సంస్థ సిలికాన్ జెల్‌తో తయారుచేసిన కృత్రిమ వక్షోజాలు కొంత కాలం క్రితం నుంచి బాగా ప్రసిద్ధి చెందాయి. అంతర్జాతీయంగా పలు దేశాలు వీటినే దిగుమతి చేసుకుని ఉపయోగిస్తున్నాయి. ఇది బాగా మృదువైన పదార్థం కావడంతో పాటు.. చాలావరకు సురక్షితం అని ప్రచారం జరగడంతో సౌదీ అరేబియా, కతార్, కువైట్ లాంటి దేశాల్లో మహిళలు వీటివైపు మొగ్గు చూపించారు. వీటిని అమర్చుకుని తమకు అంతకు ముందు ఉందని భావించిన లోపాన్ని సరిచేసుకున్నారు.
అప్పటివరకు బాగానే ఉంది. కానీ, వీటిలో వాడిన సిలికాన్ క్రమంగా కరిగిపోయి శరీరంలో కలుస్తున్నట్లు, దానివల్ల పలు రకాల వ్యాధులు వస్తున్నట్లు గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వీటిని ఇటీవలే నిషేధించడంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గల్ఫ్ దేశాలలో కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. జెడ్డా నగరంలో ప్లాస్టిక్ సర్జరీలు చేసేందుకు ఒకే ఒక్క ప్రైవేటు ఆస్పత్రి ఉంది. ఇక్కడకు భారీ సంఖ్యలో మహిళలు వచ్చి, తమకు అమర్చిన కృత్రిమ వక్షోజాలను తొలగించాల్సిందిగా కోరారు.
ఇలా ఒక్క జెడ్డా నగరంలోనే సుమారు 300 మంది మహిళలు వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలియడంతో సౌదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాసిరకం కృత్రిమ వక్షోజాలను తొలగించడానికి రంగంలోకి దిగి, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక హాట్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఒక్కొక్కరి శస్త్రచికిత్సకు అయ్యే రూ. 5 లక్షల ఖర్చును తామే భరిస్తామని కూడా వెల్లడించింది. కతార్, కువైట్ లాంటి దేశాలలో కూడా ఇలాంటి సమస్య ఉన్నా.. సౌదీలో మరింత తీవ్రంగా ఉంది. దీన్ని వినియోగించుకుని శస్త్ర చికిత్సలు చేయించుకోడానికి మహిళలు ముందుకొస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more