1985లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఉద్యోగం వదిలేసి పారిశ్రామికవేత్తగా మారి.. అప్పటి నుండి యూత్ కాంగ్రెస్ సభ్యత్వం పుచ్చుకొని 1989లో గుంటూరు-1 టికెట్ అడిగితే ఇవ్వకపోవటంతో.. . శివశంకర్ తోడ్పాటుతో పెదకూరపాడు సీటు దక్కించుకొని.. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.
మంత్రి కన్నా అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది ఆయన నుదుడిపై ఉన్న బొట్టు. ఆ బొట్టు ఆయనకు ఒక ప్రత్యకతను చాటుతుంది. మంత్రి కన్నా చిన్నప్పటి నుండి బాడీ బిల్డర్ కావటంతో.. ఆయనకు ఇష్ట దైవం .. ఆంజనేయస్వామి. ఆయన భక్కుడిగా మారి .. అప్పటి నుండి ఆ బొట్టు తో ప్రజా నాయకుడిగా ఎదిగారు.
కాంగ్రెస్‌ని భూస్థాపితం చేస్తానంటున్న వైఎస్ జగన్‌తో ఏదో ఒక దశలో ఘర్షణ పడాల్సిందేనని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాడీ బిల్డర్‌గా జీవితం ప్రారంభించి.. అనతికాలంలోనే రాజకీయంగా ఎదిగి.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రతిసారీ మంత్రి పదవిని దక్కించుకున్న ఈ కాంగ్రెస్ నేత ఒక ప్రముఖ ప్రతిక ఎండీ నిర్వహించిన కార్యక్రమంలో తన మనస్సులోని మాటలను బయటి ప్రపంచానికి తెలియచెప్పాడు మంత్రి కన్నా.
ఇప్పటి వరకు ఎవరికి తెలియన విషయాలను మంత్రి కన్నా చెప్పాటంతో .. చాలా ఆశ్చర్యన్ని కలిగిస్తుందని .. రాజకీయ నాయకులు అంటున్నారు. మంత్రి కన్నాకు మొదటి నుండి కొంత మంది శత్రువులు ఉన్నారని అంటున్నారు. వారిలో ముఖ్యంగా.. చంద్రబాబు పేరు చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఒక చంద్రబాబే కాకుండా .. రాయపాటి సాంబశివరావు, సీపీఐ నారాయణ కూడా మంత్రి కన్నా శత్రువులేనని ఆయన అంటున్నారు.
గతంలో ఒకసారి మంత్రి కన్నా ఎన్ఎస్‌యూఐలో ఉండగా ఏఐఎస్ఎఫ్‌తో గొడవ జరిగిందట ప్రస్తుత సీపీఐ నేత నారాయణ బృందం దాడిచేయగా, 11 కత్తిపోట్లు పడ్డాయాని కన్నా అంటున్నాడు. ఆ తరువాత మంత్రి కన్నాకు వంగవీటి రంగా పరిచయం ఏర్పడింది. మంత్రి కన్నాకు ఒకనొక సమయంలో ఎన్టీఆర్,చంద్రబాబుల పై కోపం వచ్చిందని చెబుతున్నారు. కన్నా మొదటి నుండి ఎన్టీఆర్‌కు అభిమానేనట. అయితే అనంతపురంలో ఆయన నైతిక విలువలపై మాట్లాడినప్పుడు మాత్రం, లక్ష్మీపార్వతితో ఆయన సంబంధాన్ని విమర్శిం చిన కన్నాకు అక్కడ చేదు అనుభవం అయిందని అంటున్నారు.
కానీ అప్పుడు చంద్ర బాబు- తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో ఉన్న కన్నాను చంపటానికి విశ్వప్రయత్నం చేశారని కన్నా అంటున్నాడు . అంతే కాకుండా.. కృష్ణాజిల్లాలో వంగవీటి రంగాను నిర్మూలించాలనుకున్నారని లక్ష్మీనాయారణ చెబుతున్నాడు. అయితే చంద్రబాబు ప్లాన్ ప్రకారం 1990 లో వంగవీటి రంగాను చంపటం జరిగింది.. ఆ తరువాత అనేక సార్లు .. కన్నా పై చంద్రబాబు ఎటాక్ చేయటం జరిగిందని కన్నా అంటున్నాడు.
అయితే మంత్రి కన్నా పై ఇలా జరుగుతున్నప్పటికి . పదవి కోసం ఎప్పుడూ పాకులాడకుండా బయ్యవరం జనం కోసం ఎద్దువాగు మీద బ్రిడ్జి కోసం అలుపెరగాని పోరాటం మంత్రి కన్నా చేశారట. అప్పటి ముఖ్య మంత్రి నేదురమల్లి జనార్థన్ రెడ్డి గారు . మంత్రి కన్నాను . . 'బ్రిడ్జి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగినప్పడు కన్నా బ్రిడ్జే కావాలని నిర్భయంగా చెప్పాడట. అంతేకాకుండా రాయపాటికి కన్నాకు ఉన్న వైరం గురించి కూడా చెబుతున్నాడు. అసలు వైరం సిద్ధాంతపరమైనదే గానీ వ్యక్తిగతం కాదు. పెదకూరపాడులో కన్నాను ఓడించి టీడీపీని గెలిపించాలని రాయపాటి ప్రచారం చేశారట. చేబ్రోలు హనుమయ్య మధ్యవర్తిత్వం మేరకు 1996 ఎన్నికల్లో రాయపాటి గెలుపు కోసం మంత్రి కన్నా పనిచేశారట. అయితే రాయపాటి వైఖరి మార్చుకుంటానంటేనే పని చేస్తానని కన్నా షరతుపెట్టినప్పటికి రాయపాటి ప్రతి ఎన్నికల్లోనూ వ్యతిరేకంగానే పని చేస్తున్నారని కన్నా అంటున్నారు.
చంద్రబాబు మరొసారి కన్నా పై కొత్త ప్రయోగం చేసాడని చెబుతున్నారు. అప్పట్లో గజ దొంగ రామారావుకు కన్నానే ఆశ్రయం ఇచ్చారని పత్రికలలో రాయించాడని కన్నా చెప్పటంతో ఆ పత్రిక ఎండీ ఖంగుతిన్నాడు. ఎందుకంటే.. ఆ పత్రిక కూడా వీరిదే కాబట్టి. ఇలా అనేక సార్లు చంద్రబాబు కన్నా చంపటానికి ప్రయత్నించి విఫలమైనాడని కన్నా చెప్పాటంతో.. రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైనారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more