మొన్న విశాఖపట్టణం ఎంపీ అయిన డి. పురందేశ్వరి పై పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఇప్పుడు కొత్త మాట చెబుతున్నారు టి. సుబ్బరామిరెడ్డి. రానున్న నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డిని బరిలో నిలపాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవు తోంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ నెల్లూరు లోక్‌సభను గెలుచుకోవడం పార్టీకి ప్రతి ష్ఠాత్మక మయినందున, అక్కడ అంగబలం, ఆర్ధికబలం దండిగా ఉన్న సుబ్బరామిరెడ్డిని బరిలో దింపడమే సరైందన్న వాదన సీనియర్లలో వినిపిస్తోంది.
ప్రస్తుతం సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్ప టికీ, పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సిందేనని ప లువురు సీనియర్లు ఇటీవల ముఖ్యమంత్రికి సూచించిన ట్లు సమాచారం. టీఎస్సార్ మాత్రం విశాఖపట్నం వైపే చూస్తున్నప్పటికీ, నెల్లూరు ఆయన సొంత జిల్లా అయినందున, అక్కడి నుంచే పోటీ చేయించాలన్న వాదన వినిపి స్తోంది. పైగా నెల్లూరు నుంచి భవిష్యత్తులో పోటీ చేసే పెద్ద స్థాయి నాయకుడు ఎవరూ కనిపించటం లేదంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి రా నున్న లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించినప్పటికీ.. టీఎస్సార్ వంటి పెద్ద స్థాయి నాయకుడి సేవలు అవస రమని పార్టీ సీనియర్లు వాదిస్తున్నారు. టీఎస్సార్‌కు సొంత జిల్లాలో బంధుగణం ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండ టం, మేకపాటి వంటి బలమైన నాయకుడికి అన్ని రంగా ల్లో సరిసమానంగా ఉండటం వల్ల మేకపాటికి టీఎస్సారే సరైన పోటీదారని వారు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది.
అయితే, టీఎస్సార్ నెల్లూరులో పోటీకి విముఖత వ్యక్తం చేసినా ఆయనను ఒప్పించయినా పోటీకి దింపాలన్న వాద న వినిపిస్తోంది. పార్టీ వల్ల ఈ స్థాయికి వచ్చిన టీఎస్సార్‌ను పార్టీ కోసం అంగీకరించేలా చూడాలంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా పార్టీని ఆదుకోకపోతే ఎలా అని ఓ సీని యర్ పార్లమెంటుసభ్యుడు వ్యాఖ్యానించారు. నిజానికి టీఎస్సార్‌కు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పో టీ చేయాలన్న కోరిక ఉంది. ఆయన చాలాసార్లు దానిని వ్యక్తం చేశారు.
కానీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి ససేమిరా అంటు న్నారు. ఒకవేళ అది కుదరకపోతే నరసరావుపేట నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే హటాత్తుగా నెల్లూరు లోక్‌సభకు ఖాళీ ఏర్పడటంతో.. అక్కడి నుంచి మేకపాటిని అన్ని రంగాల్లో ఎదుర్కొనే సమర్థులు ఎవరూ లేనందున, సుబ్బరామిరెడ్డిని బరిలోకి దింపాలన్న వాదన సొంత పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది. టీఎస్సార్ స్పందన ఏమి టన్నది చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more