ఎమ్మార్ విల్లా, ప్లాట్లను కొన్న ప్రముఖులంతా డాక్యుమెంట్‌లో చూపిన ధర కాకుండా మిగిలిన సొమ్మును నగదు రూపంలో నోట్ల కట్టలను సంచుల్లో తెచ్చి ఇచ్చేవారని స్టెలిష్ హోమ్స్ మేనేజరు కొడాలి శ్రీనివాసరావు తెలిపారు. ఇలా తీసుకున్న సొమ్మును కోనేరు రాజేంద్రప్రసాద్, కుటుంబసభ్యులు, ఆయన చెప్పిన సునీల్‌రెడ్డిలకు అందజేశానని చెప్పారు. విల్లాలు, ప్లాట్లకు డాక్యుమెంట్‌లో పేర్కొన్న ధరకు చెక్కుల ద్వారా వసూలు చేశామని, దీనికి సంబంధించి ఖాతాలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే నగదుగా తీసుకున్న మొత్తానికి తానెలాంటి లెక్కలు నిర్వహించలేదని... కోనేరు, తుమ్మల వాటిని ఏం చేశారో కూడా తెలియదన్నారు.
ఎమ్మార్ కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది డిసెంబరు 26న సీబీఐ శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాని ఆధారంగా శ్రీనివాసరావును ఇటీవల కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో 43వ సాక్షిగా పేర్కొంది. వెలుగులోకి వచ్చిన వాంగ్మూలం ప్రతిలో శ్రీనివాసరావు నగదు వసూళ్లకు సంబంధించి చెప్పిన వివరాలివి... సమన్వయ బాధ్యతలు: రిజిస్ట్రేషన్ ఫారాలు తీసుకురావడం, అవగాహన ఒప్పందాలు కుదర్చడం, గుర్తించిన వినియోగదారుల నుంచి చెక్కులను వసూలు చేసి వాటిని ఎమ్మార్ హిల్స్, ఎమ్మార్ ఎంజీఎఫ్ తదితర కంపెనీలకు అందజేయడం వంటివన్నీ చూసేవాడినని చెప్పారు.
తుమ్మల రంగారావు, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు భూములను కొనుగోలు చేయడానికి ఏకంగా ఏడు కంపెనీలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇలా ఏర్పాటైన బాలాజీ నర్సరీస్, బిల్‌కల్ రిసార్ట్స్, బిల్‌కల్ షెల్టర్స్, బిల్‌కల్ నర్సరీస్, వెన్‌సువా నర్సరీస్, వెన్‌సువా షెల్టర్స్, విశిష్టా డెవలపర్స్ కంపెనీల్లో తానూ డైరెక్టర్‌నని వెల్లడించారు. 2007-10 మధ్య ఈ ఏడు కంపెనీలు కలిసి 101.5 ఎకరాలను బిల్‌కల్‌లో సేకరించాయని పేర్కొన్నారు. కోనేరు కుటుంబసభ్యులు కూడా ఇదే గ్రామంలో 2006-08 మధ్య 60ఎకరాలను సేకరించారన్నారు.
సీబీఐ అనుమానించిందే నిజమవుతోంది. ఎమ్మార్ కుంభకోణంలో డబ్బు సంచులన్నీ వైఎస్ జగన్ బంధువు సునీల్‌రెడ్డికి చేరినట్లు స్పష్టమవుతోంది. మరికొన్ని సంచులు కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్‌కు చేరినట్లు తేలిపోయింది. విల్లాలు, ప్లాట్లను చదరపు గజం రూ.5000కే కొన్నామంటూ చేసిన వాదనలూ తప్పని రుజువైంది. ఆ ఐదువేల వెనక ఉన్న బ్లాక్ మనీ బాగోతం బయటకు వచ్చింది. "ఎమ్మార్‌లో విల్లాలు, ఫ్లాట్లు కొన్నవారు సంచులతో బ్లాక్‌మనీ ఇచ్చారు. వాటన్నిటినీ కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్, వైఎస్ బంధువు సునీల్‌రెడ్డికి ఇచ్చాను'' అని ఎమ్మార్ కేసులో కీలక సాక్షి, స్టైలిష్ హోమ్స్ అధినేత తుమ్మల రంగారావు వద్ద మేనేజర్‌గా పని చేసిన కొడాలి శ్రీనివాసరావు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. ఈ కేసులో 43వ సాక్షి అయిన శ్రీనివాసరావును సీబీఐ పలుమార్లు విచారించింది.
ఈ సందర్భంగా, విల్లాల విక్రయానికి సంబంధించిన లావాదేవీలు ఎక్కడెక్కడ, ఎలా జరిగిందీ ఆయన సీబీఐ అధికారులకు వివరించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగానే వైఎస్ బంధువు సునీల్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తం లావాదేవీలన్నీ కోనేరు ప్రసాద్ ఇంట్లోనే జరిగాయని, డాక్యుమెంట్లలో ఉన్న రేటును చెక్కు రూపంలో.. అదనపు సొమ్మును సంచుల్లో తెచ్చి ఇచ్చారని, ఆ సొమ్మును ప్రదీప్, సునీల్ రెడ్డిలకు పలుమార్లు అందజేశానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more