ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త ప్లాన్ తెలంగాణ పై ప్రయోగించబోతుంది. ఇప్పుడు తెలంగాణ ఇస్తే .. దెబ్బ తెలంగాణ ఇవ్వకుంటే మరొ దెబ్బ అనే రీతిలో ఉంది. అంటే ముందుకు పోతు గొయ్యి.. వెనకు వస్తే .. నుయ్యి అనే విధంగా కాంగ్రెస్ కష్టాలలో ఉందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఈ ఫ్లాన్ తో .. రెండు వర్గాల వారిని లాభం లేకపోయిన.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మస్తు లాభం ఉంటుందని వారు అంటున్నారు. భవిష్యతును ఊహించుకొని .. ఈ సరికొత్త ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నదని ఢిల్లీ నాయకులు అంటున్నారు.
రాష్ట్రాన్ని విడగొట్టడం కంటే.. కలిసే ఉండే విధంగా పావులు కదుపుతున్నారని అర్థం అవుతుంది. అమ్మ ప్లాన్ ఏంటాయ్య అంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులు రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. వారు పార్టీ విడి .. టీఆర్ఎస్ చేరుతున్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు తెలంగాణ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరటం ఇష్టంలేనివారు మాత్రమే కాంగ్రెస్ ఉన్నారన్న సత్యం తెలిసిందే. తెలంగాణ ప్రజల మధ్య టీ. కాంగ్రెస్ నాయకులు తిరగాలంటే.. వారికి ఒక మంత్రం వేయాలని అధిష్టానం చూస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల చేతనే.. కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. వారిబలంతో.. కేంద్రంలో..కాంగ్రెస్ స్థానం కదలకుండా చేయాలని చూస్తుంది. అలాగే సీమాంద్రాలో కూడా ఇదే ప్లాన్ అప్లయ్ చేసి. ఈ ఇద్దరి అండతో .. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేకుండ చూడాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ విధంగా తెలంగాణకు చెక్ పెట్టవచ్చునని .. ఢిల్లీ నాయకుల ఆలోచనని.. సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు 'సొంత దారి' చూసుకుంటున్నారా? అధిష్ఠానం తీరుపై విసిగి వేసారి... వేరుకుంపటి పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారా? 'తెలంగాణ కాంగ్రెస్' పేరిట మరో ఉప ప్రాంతీయ పార్టీ ఏర్పాటు కానుందా? ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానం లభిస్తోంది.
తెలంగాణపై అధిష్ఠానం అటో ఇటో తేల్చకుండా... నాన్చుడు వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తీవ్రంగా ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థులకు వరుసగా ఘోర పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీ నేతలకు ఎటూ పాలుపోవడంలేదు. ఆత్మహత్యల నేపథ్యంలో తమ చిత్రాలను, దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నా... రాజీవ్, ఇందిర విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ఖండించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
తమతమ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేక పోతున్నారు. ఈ అవమానాలన్నింటినీ భరించినా అధిష్ఠానాన్ని తెలంగాణ విషయంలో ఒప్పిస్తే మళ్లీ హీరోలుగా చలామణి కావచ్చన్న ధీమా కూడా వీరిలో నెమ్మదిగా కరిగిపోతోంది. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వారిలో బలపడుతోంది. ఎందుకంటే... యూపీఏలో కీలక భాగస్వాములైన ఎన్సీపీ, తృణమూల్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ 'విభజన'కు వ్యతిరేకమనే వాదనలున్నాయి. ఇక... చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని సమాజ్‌వాది నేత ములాయం బహిరంగంగానే చెప్పారు.
తెలంగాణకు సానుకూలతను వ్యక్తం చేస్తే... తమ సొంత రాష్ట్రాల్లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళనే దీనికి కారణం. ఈ 3 పార్టీల మాట కాదని కాంగ్రెస్ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది. 'తెలంగాణ తెచ్చేది - ఇచ్చేది మేమే' అని... 'మమ్మల్ని గెలిపిస్తే బంగారు పళ్లెంలో తెలంగాణ తెస్తాం' అని చేసే నినాదాలకు జనం స్పందించే పరిస్థితి కూడా కనిపించడంలేదు.
పైగా... తమను తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించడం, భావోద్వేగాలు తీవ్రమైన ప్రతిసారీ తమ ఇళ్లపై రాళ్ల దాడులు చేయడం, నాయకులను అడ్డుకోవడంవంటి చర్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయంగా తమకు మనుగడ ఉండదని వీరు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక పార్టీ స్థాపించడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారమని వీరు భావిస్తున్నారు.
తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినప్పుడల్లా పార్లమెంటు సమావేశాలనో, ఏదో రాష్ట్రంలో ఎన్నికలనో మమ్మల్ని బుజ్జగించి వెనక్కి పంపిస్తున్నారు. నిశ్చితాభిప్రాయాన్ని చెప్పడం లేదు. అధిష్ఠానం మాటతో ప్రజల్లోకివెళ్లి చులకన అవుతున్నాం'' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తామంతా ఒకసారి సమావేశం కావాలని... ఆ తర్వాత విడతల వారీగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్ఠానం సానుకూలంగా స్పందించకుండా అవమానకర రీతిలో వ్యవహరిస్తే... ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా పార్టీకి గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకోవాలనే దిశగా నేతలు ఆలోచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more