ఇప్పుడు నందమూరి హరికృష్ణ అగ్నిగోళంలో మండిపోతున్నాడు. నందమూరి హరికృష్ణ తన ఆవేశమంత తెలుగు దేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు (బావ) మీద అని అందరు అనుకుంటున్నారు. కానీ అసలు విషయం అది కాదట. నందమూరి హరికృష్ణ ఏడుపు వెనక పెద్ద రహస్యం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో .. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోకపోవటం లేదని అందరికి తెలిసిన విషయమే. బాబు ఎన్టీఆర్ బదులు .. బావమరిది అయిన .. హీరో బాలయ్యను తెరపైకి తెచ్చిన విషయం తెలిసింది. బాలయ్య టీడీపీలోకి సునామీల వచ్చి కొన్ని ప్రాంతలలో పర్యటన చేయటం కూడా జరిగింది. బాలయ్య పర్యటనలో చేసిన వ్యాఖ్యలను పట్టి చూస్తే , ఇప్పడు హరికృష్ణ దూకుడు వ్యవహారం ఎందుకు జరుగుతుంది అనే విషయం పార్టీ నాయకులకు అర్థం అయింది.
చంద్రబాబు తన చాణుక్య బుర్రతో.. ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ ను , హరికృష్ణను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఒకేసారి ఆ ఇద్దరి చెక్ పెట్టేందుకే తెరపైకి బాలయ్యను తెచ్చాడు అనే నిజం టీడీపీ నాయకులు మద్య నలుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న నందమూరి హరికృష్ణ ఇక తనను ఎవరు పట్టించుకోరు, నాకు విలువు లేకుండా పోతుందన భావించి నందమూరి హరికృష్ణ బాబు పై ఫైర్ అయినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇలాంటి సన్నివేశాన్ని జీర్ణించుకోలేని హరికృష్ణ ,ఈ బయటపడ్డాడని టీడీపీ నాయకలు అంటున్నారు. అయిన ఇది ఇలాంటి ఆయకు కొత్తేమి కాదు. హరికృష్ణ గతంలో ఇలాంటి చాలా చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో నందమూరి కలకలం మళ్లీ మొదలయింది. తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లు నిండిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. నాయకులను చొక్కా పట్టు కుని నిలదీయాలంటూ హరి చేసిన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హరికృష్ణ తీవ్ర అసమ్మతితో ఉన్నారని స్పష్టం చేస్తు న్నాయి. టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని జగన్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హరికృష్ణ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం కలకలం సృష్టిస్తోంది.
నాయకుల వల్లనే పార్టీ నీరసపడిందన్నారు. పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అన్నగారి పార్టీని మళ్లీ ప్రజలు అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు పల్లకిలో కూర్చుంటామంటే ఇక మోసే వారెవరని ఆయన ప్రశ్నించారు. పని చేయని నాయకుడిని నిలదీయాలన్నారు. ఇది కార్యకర్తల పని అన్నారు. ఈ పార్టీ ఎన్టీఆర్ మానస పుత్రిక అని, పార్టీలో ఎలాంటి లోపం లేదన్నారు. ఎన్టీఆర్కు ఎవరో చెబితే, ఎవరో నేర్పితే వచ్చిన పార్టీ కాదన్నారు. మూడువందలకు పైగా సినిమాల్లో నటించి ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం పార్టీని స్థాపించారన్నారు. తెలుగుదేశం నందమూరి కుటుంబానిదేనని ఆయన చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ అవసరమైన సమయంలో టిడిపికి సేవలందిస్తారన్నారు. ఎన్టీఆర్కు ఇంకా రాజకీయ అనుభవం కావాలన్నారు. మమ్మల్ని బయటకు పంపేంత వరకు టిడిపికి సేవ చేస్తామన్నారు. పార్టీని బతికించుకోవాల్సి ఉందన్నారు. ఓ వైపు కాంగ్రెసు పార్టీ నేతలతో కొందరు నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని విమర్సించారు. కాంగ్రెసుతో చేసే వ్యాపారాలను పార్టీ అధినేతలు అడ్డుకోవాలన్నారు. కాగా టిడిపి కాంగ్రెస్తో కుమ్మక్కైందన్న జగన్ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.
కాగా చంద్రబాబుపై పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోసారి అలిగిన విషయం తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తికి గురైన ఆయన చంద్రబాబుపై అలిగినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపి) కార్యాలయం వెలుపల కూర్చుని ఆయన తన నిరనసను తెలియజేశారు. తెలుగుదేశం వ్యాపారవేత్తల పార్టీ అయిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more