ఏ నాయకుడు ఏ పార్టీ లో ఎంతసేపు ఉంటాడో ఎవరి తెలియదు. సెల్ లో సిమ్ మార్చినట్లు తమ పార్టీ పేర్లను ఈజీగా మార్చేస్తున్నారు. ఏ కంపెనీ సిమ్ కు మంచి ఆఫర్లు ఉంటాయో .. ఆ కంపెనీ సిమ్ కు కనెక్ట్ అయిపోతున్నారు ఈతరం పొలిటికల్ నాయకులు. త్వరలో ఒక సీనియర్ నాయకుడు.. తన పాత సిమ్ మార్చబోతున్నాడట? సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైకిల్ నుండి దిగటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఉమ్మారెడ్డి పోయిన సంవత్సరం నుండి ఆయన పార్టీ యొక్క తీరుపై అసంత్రుప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అప్పట్లోనే ఆయన జగన్ పార్టీలో చేరతాడనే వార్తలు పార్టీ సినియర్ నాయకుల వద్ద వినిపించాయి. ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయాని ఉమ్మారెడ్డి సన్నిహితులు అంటున్నారు.
గత కొద్ది రోజులుగా ఉమ్మారెడ్డి జగన్ తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మారెడ్డి త్వరలో బాబు కు గుడ్ బై చెప్పి.. జగన్ తో చేతులు కలపాటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఉమ్మారెడ్డి వైఎస్ ఆర్ పార్టీలో చేరటానికి పెద్ద కారణం ఉందని చెబుతున్నారు. ఉమ్మారెడ్డి తనయుడు రమణ ను కూడా వైఎస్ పార్టీ చేర్చి .. రాబోయే ఎన్నికలలో ఎంపీ టిక్కెట్ ఇచ్చే విధంగా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అదీ కూడా బాపట్ల నుండే ఉమ్మారెడ్డి కొడుకు వైఎస్ఆర్ పార్టీ నుండి పోటీ చేసే విధంగా .. ప్రక్క ప్లాన్ సిద్దమైనట్లు తెలుస్తుంది.
ఉమ్మారెడ్డి విషయం ఇప్పుడు టిడిపి పార్టీ పెద్ద చర్చగా మారింది. ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి అడుగులు వేస్తున్నాడు అనే విషయం తెలుగు దేశం సీనియర్ నాయకులు తెలియటంతో.. వారు ఆ విషయాన్ని బాబు తో చెప్పినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై బాబు ఇంక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ఉమ్మారెడ్డి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గతంలో మంత్రి పదవి కూడా చేసిన విషయం తెలిసిందే.
అయితే తన రాజకీయ జీవితంలోకి తన కొడుకు కూడా దించటం కోసమే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా .. ఉమ్మారెడ్డి ఆలోచనా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఉమ్మారెడ్డి రాకకోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎదురుస్తున్నట్లు జగన్ సన్నిహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more