బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. అమితాబ్ భార్య జయాబచ్చన్‌ను, ఆయన మాజీ ప్రేయసి రేఖను ఒకే 'హౌస్'లో ఉంచగలిగింది' ఇది ఇటీవల కాలంలో హల్‌చల్ చేస్తున్న ఎస్సెమ్మెస్. వారిద్దరినీ ఒకే చోట చేర్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఒకేచోట మాత్రం కూర్చోబెట్టలేకపోయింది. అసలు విషయానికొస్తే..సమాజ్‌వాదీపార్టీ తరపున జయాబచ్చన్, నామిటినేటెడ్ కోటాలో రేఖ రాజ్యసభకు ఎంపికయ్యారు. జయ, రేఖలకు రాజ్యసభలో వరసగా 91, 99 సీట్లు కేటాయించారు. తన భర్త మాజీ ప్రేయసికి దగ్గరలో కూర్చోడానికి జయాబచ్చన్ ససేమిరా అన్నారు. పట్టుబట్టి మరీ తన సీటును వేరే చోటికి మార్పించుకున్నారు. 1970ల్లో అమితాబ్, రేఖల మధ్య ప్రేమాయణం నడిచింది.అయితే చివరకు అమితాబ్ జయను పెళ్లి చేసుకోవలసి వచ్చింది.
రాజ్యసభలో తను కూర్చునేందుకు మరో చోట సీటు కేటాయించవలసిందిగా జయాబచ్చన్ చేసిన అభ్యర్థనను ఆమోదించారు. ప్రస్తుతం ఆమె 91వ సీట్లో కూర్చుంటున్నారు. అయితే అదే వరసలో 99వ సీటును కొత్తగా రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఆనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖకు కేటాయించారు. జయాబచ్చన్ భర్త అమితాబ్ బచ్చన్‌కు, రేఖకు మధ్య 1970ల చివరలో ప్రేమ వ్యవహారం సాగిందని అప్పట్లో చెప్పుకొన్నారు. ‘సిల్‌సిలా’ అనే చిత్రంలో ఈ ముగ్గురూ నటించారు కూడా. సభలో రేఖకు దూరంగా ఉండేందుకే తన సీటును రేఖ సీటుకు దూరంగా కేటాయించమని జయాబచ్చన్ కోరారని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు జయాబచ్చన్‌కు 143వ సీటును కేటాయించారు.
రేఖతోపాటు రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు 103వ సీటును కేటాయించారు. మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు, ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామి నాథన్‌కు మధ్య ఉన్న సీటును సచిన్‌కు కేటాయించినట్టు పార్లమెంట్ వర్గాలు చెబు తున్నాయి. కర్నాటక నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన మాల్యా 102వ సీట్లో ను, స్వామినాథన్ 104వ సీట్లోను కూర్చుంటున్నారు. సభకు తాజాగా నామి నేట్ అయిన మరో సభ్యుడు, అనూఆఘాకు రేఖ పక్క సీటు 98ని కేటాయిం చారు. జయాబచ్చన్ తన సీటును మార్చమని కోరడంతో సభలో తమ సభ్యుల స్థానాల్ని మార్చుకోవాలని ఎస్‌పీ భావించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more