ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి నట్టి కుమార్. చిన్న విషయాని, పెద్ద విషయానికి నట్టి కుమార్ మీడియా ముందు ఉండాడు. టాలీవుడ్ నిర్మాతల్లో నోటి దుల ఉన్న నిర్మాత ఎవరు అంటే నట్టి కుమార్ అని టాలీవుడ్ వాసులు చెబుతున్నారట. అసలు ఈ నట్టి కుమార్ ఎవరు? నట్టి కుమార్ కు సినిమాలకు లింక్ ఏమిటీ? ఈయన సినీమా నిర్మాత ఎలా అయ్యాడు? అనే ప్రశ్నలు టాలీవుడ్ వాసులను వేధిస్తున్నాయి. నట్టి కుమార్ నగ్న రూపం గురించి సి కల్యాణ్ అసలు నిజాలు చెబుతున్నారని టాలీవువ్ వాసులు అంటున్నారు.అసలు నట్టి కుమార్ మొదట ఫుట్‌పాత్‌పై వస్త్రవ్యాపారంతో అమ్ముకుంటూ, సినిమాలకు సహాయ నటుల పంపిణీ చేస్తూ, ఉత్తరాంధ్రలో శృంగార డబ్బింగ్ చిత్రాల ప్రదర్శన చేసేవాడని నిర్మాత కళ్యాణ్ చెబుతున్నారు. ఆ తరువాత భూ సెటిల్మెంట్ల యత్నాలు.. తప్పుడు పత్రాల సృష్టించటం , కూరగాయలు అమ్మటం లాంటివి చేసేవాడటని చెబుతున్నారు.వివాదాస్పద సినీ నిర్మాత నట్టికుమార్ విశాఖ నుంచే కెరీర్‌ను ప్రారంభించారు. స్థానిక ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతవాసి అయిన ఈయన మొదట్లో రోడ్డు పక్కన బాటపై దుస్తులు అమ్ముకునేవారు. విశాఖ పరిసరాల్లో తీసే సినిమాలకు సహాయ నటీనటులను పంపిణీ చేస్తుండేవారు. ఆ తర్వాత ఇతర భాషల్లో వచ్చిన శృంగార చిత్రాలను డబ్ చేసి ఉత్తరాంధ్రలో ప్రదర్శించేవారు. 'కరుణాలయ' పేరిట విశాఖలో ఫిలిం డ్రిస్టిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ-1 స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. రియల్ ఎస్టేట్ జోరందుకోవడంతో కుమార్ దృష్టి వివాదాస్పద భూములపై పడింది. పెందుర్తి మండలం వేపగుంటలోని సర్వే నంబర్-3లోగల 15 ఎకరాలపై ఆయన కన్నేశారు. ఈ భూములు బల్ల, కర్ణం అనే ఇంటి పేర్లు గల రెండు కుటుంబాల ఆధీనంలో ఉండేవి. భవిష్యత్తు అవసరాల కోసం వుడా ఆ భూములను సేకరించింది. వీటికి నష్టపరిహారంపై న్యాయవివాదం నడుస్తుండేది. మరోవైపు.. ఆ భూములు తమవంటూ సింహాచలం దేవస్థానం వాదిస్తుండేది.ఈ దశలో బల్ల, కర్ణం కుటుంబీకులతో నట్టికుమార్ పరిచయం పెంచుకున్నారు. తాను వుడా నుంచి, సింహాచలం దేవస్థానం నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తెస్తానని, ప్రతిఫలంగా భూమిలో సగం తనకివ్వాలని కోరారు. అందుకు వారు ఒప్పుకోగానే.. బల్ల సూరిబాబు కుటుంబీకులకు చెందిన 10-12 ఎకరాలకు, కర్ణం కుటుంబీకుల మూడెకరాలకు వుడా, దేవస్థానం మంజూరు చేసినట్టు తప్పుడు ఎన్‌వోసీలు సృష్టించి కొన్ని రిజ్రిస్టేషన్లు కూడా చేయించారు. వుడా అధికారులకు ఇది తెలియడంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నట్టికుమార్ నకిలీ పత్రాలు సృష్టించినట్టు తేలినా, డాక్యుమెంట్లు రైతుల పేరిట ఉండటంతో ఆ కేసులోంచి బయటపడ్డారు. బల్ల సూరిబాబు తదితరులు మాత్రం జైలు పాలయ్యారు. ఇదే కాదు.. భీమిలి, తదితర ప్రాంతాల్లో కూడా నట్టి కొన్ని భూముల లావాదేవీలు జరిపినట్టు సమాచారం.
"అసలు నట్టికుమార్ నిర్మాతగా ఎలా ఎదిగారు?'' విశాఖలో ఆయనను తెలిసినవారందరికీ ఇప్పుడిదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నట్టికుమార్ పెద్ద సినిమాలు తీసే నిర్మాతగా ఎలా ఎదిగారన్నది ఎగ్జిబిటర్లకే అంతుచిక్కట్లేదు. గతంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన నట్టికుమార్ కొందరు థియేటర్ యజమానుల వద్ద అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ అడ్వాన్స్‌లు కూడా తిరిగి చెల్లించలేదని కొందరు చర్చించుకుంటున్నారు.
అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బట్టలు అమ్ముకున్న, కూరగాయలు అమ్ముకున్న, వ్యక్తి అయిన బాగుపడాలి, బాగుండాలి, అంతేకానీ ఇతరులకు హానీ చేసే విధంగా ఉండకూడదనేదే నా వాదన. ఇప్పుడు ఈ నట్టి కుమార్ వల్ల టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలందరికీ చెడ్డ పేరు వస్తుంది. మంచి , చెడు, ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలనేది మంచి వాని లక్షణం. ఎంత ఎత్తు ఎదిగిన తన గతం మరిచిపోగొడదు. ఎంత ఎదిగిన ఓదిగి ఉండటం మంచి మనిషి లక్షణం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more