వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ విచారణ పేరుతో మూడు రోజులు విచారించిన తరువాత సిబిఐ అరెస్ట్ చేయటం జరిగింది. జగన్ ను కోర్టు జడ్జి ముందు నిలబెట్టడం జరిగింది. కోర్టులో సిబిఐ లాయర్లు , జగన్ లాయర్ల వాదానలు విన్న న్యాయమూర్తులు జగన్ ను 14 రిమాండ్ ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సూచనలు మేరకు జగన్ చంచల్ గూడ జైలుకు తరలించటం జరిగింది అనేది అందరికి తెలిసిందే. కానీ తెలియని విషయం ఒక దాగి ఉందని. కోర్టు లంచ్ సమయంలో ఒక సంఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు . అదీ ఎంటయ్యా అంటే?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసు తదితర కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. కోర్టు సిబ్బంది తక్షణమే స్పందించడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. నాంపల్లి కోర్టులో వైయస్ జగన్‌ను హాజరుపర్చిన విషయం తెలిసిందే.
కోర్టు భోజన విరామ సమయంలో లక్ష్మీ నారాయణ, ఇతర అధికారులు, న్యాయవాదులు మూడో అంతస్తులోని కోర్టు హాల్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో వస్తుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లక్ష్మీ నారాయణతో పాటు పదకొండు మంది లిఫ్ట్‌లో ఉన్నారు. న్యాయవాదుల కోసం ఉన్న ఈ లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కడం వల్లనే బరువుతో ఆగిపోయింది.
లిఫ్ట్‌లో ఉన్న వారు అత్యవసర మీట(ఎమర్జెన్సీ బటన్) నొక్కడంతో కోర్టు సిబ్బంది వెంటనే స్పందించింది. కీతో దాని తలుపులు తెరిచారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు మూడు అడుగుల ఎత్తులో ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న వారి కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయి. కోర్టు సిబ్బంది లిఫ్ట్‌కు సమాంతరంగా కుర్చీని ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని దించారు.
ఐదుగురి తర్వాత లక్ష్మీ నారాయణ దిగారు. బరువు వల్ల లిఫ్ట్ బెల్ట్ తెగిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా లిఫ్ట్ నుండి బయటపడిన తర్వాత లక్ష్మీ నారాయణ సరదాగా... ఇలాంటివి అప్పుడప్పుడు అనుభవించాలంటూ నవ్వుతూ వ్యాఖ్యానించి, లంచ్‌కు వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more