భాగ్యనగరం హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువై పోతున్నాయి. ధనవంతుల పిల్లలు.. సరదా పేరిట ఇలాంటి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. పరిమితి లేకుండా మాదక ద్రవ్యాలు సేవించడం.. పార్టీలో నచ్చిన వారితో బాహాటంగానే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనడం లక్ష్యంగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఈ పార్టీలు అత్యంత రహస్యంగా జరుగుతుంటాయి. పార్టీ జరిగే స్థలం.. అక్కడ లభ్యమయ్యే మాదక ద్రవ్యాలు, హాజరయ్యే యువతీ యువకుల గురించి సభ్యులకు కూడా ఆఖరు నిమిషం వరకూ తెలియ చెప్పరు.
పార్టీలోకి అన్యుల ప్రవేశం దుర్లభం.ఇలాంటి పార్టీ ఒకటి బంజారాహిల్స్ లో జరుగుతోందని నిన్న రాత్రి దక్షిణ మండలం స్పెషల్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రకి సమాచారం వచ్చింది. తక్షణమే రేవ్ పార్టీ జరిగే ప్రాంతంపై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న వారి నుంచి పెద్ద ఎత్తున కొకైన్, ఎల్ఎస్ డీ తదితర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఉగాండా దేశానికి చెందిన వారిగా గుర్తించారు. 1950లో లండన్ లో పురుడు పోసుకున్న రేవ్ పార్టీ సంస్కృతి.. 1980కి గానీ అమెరికాకు చేరలేదు.
అమెరికాతో విద్య, ఉద్యోగ బంధం పెరగడంతో భారతీయ యువత రేవ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. దీన్ని మన దేశానికీ పరిచయం చేస్తున్నారు. భారత్ లోని టీనేజర్స్ ని రేవ్ ఇటీవలి కాలంలో విపరీతంగా ఆకర్షిస్తోంది. ఒళ్లు తెలియనంతగా మద్యం లేదా మాదక ద్రవ్యాన్ని సేవించి అమ్మాయిలతో బాహాటంగానే విచ్చలవిడి శృంగారంలో పాల్గొనడం కోసం ధనవంతుల పిల్లలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడీ పార్టీ కల్చర్ జజ విదేశీయులు ఎక్కువగా సందర్శించే ఢిల్లీ, గోవా, ముంబై తదితర ప్రాంతాల్లో ఎక్కువవుతోంది. ప్రముఖ కృష్ణ క్షేత్రం ఉడుపి సమీపంలోనూ ఇటీవల రేవ్ పార్టీ జరగడం సంచలనం రేకెత్తిస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more