ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మార్చలంటే.. ఒక్క కాపుల వల్లే అవుతుందని రాజకీయ పార్టీలు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో 28 శాతం ఓట్లు ఉన్న కాపులు మాత్రం ఇప్పటి వరకు నాయకత్వం వహించిలేదు. ఒక్కోక్క నియోజక వర్గంలో 40, 50 వేలు ఓట్లు ఉప్పటికి పదవులు మాత్రం దక్కటం లేదు. అది గమనించిన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 6 సీట్లు కాపులకు ఇవ్వటం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే ఇవ్వటం చాలా ఘోరమైన విషయమాని కాపు సంఘాలు మండిపడుతున్నాయి . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాపులకు ఒక సీటు కూడా ఇవ్వలేదని .. కాపు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు కాపుల ఓట్ల పై రాజకీయ గెలుపు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయ తెరపైకి వచ్చిన ప్రజరాజ్యం పార్టీ తో మెగా స్టార్ చిరంజీవి రావటంతో.. రాష్ట్రంలోనే కాపులకు , బిసిలకు సామాజిక న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ చిరంజీవికి రాజకీయ అనుభవం లేకపోవటం, ప్రజలకు ఏం చేస్తారో చిరు చెప్పకపోవటం, తనను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని చిరంజీవి అనుకోవటం, పార్టీకి పెద్ద మైనస్ గా నిలిచాయి. అంతేకాకుండా .. కొంతమంది వలస రాజకీయ నాయకుల వలన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం జరిగిందని కాపులు అంటున్నారు.
రాష్ట్ర రాజకీయాల దిశ-దిశను మార్చనున్న ఉప ఎన్నికల్లో కులమే కీలకం కానుంది. ప్రధానంగా సీమ, కోస్తాలో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కాపు-బలిజ సామాజిక వర్గాలు ఏ పార్టీకి కాపు కాస్తాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. మొన్నటి వరకూ పీఆర్పీ జెండా మోసిన కాపు-బలిజ ఈసారి ఎవరికి దన్నుగా నిలుస్తాయో, ఆ పార్టీ విజయం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దానితో సహజంగానే అందరి చూపూ ఆ రెండు సామాజికవర్గాలపైనే మళ్లింది. రాయలసీమలోని ఆళ్లగడ్డ, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గంలో బలిజ సామాజికవర్గం, కోస్తాలో నరాసాపురం, రామచంద్రా పురం, ఒంగోలు, ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గ ప్రభావం విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో నియోజకవర్గంలో సగటున 30, 40 వేల ఓటర్లు ఈ సామాజికవర్గాలకు ఉండటంతో అన్ని పార్టీలూ అటు వైపే ఆశతో చూస్తున్నాయి. ఎవరికి ఓటు వేస్తారోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. గతంలో చిరంజీవి పీఆర్పీ స్థాపించినప్పుడు ఈరెండు సామాజికవర్గాలు చిరుకు దన్నుగా నిలిచాయి.తమ కులం పార్టీగా భావించాయి.
ఆయన పార్టీకి పోలయిన 70 లక్షల ఓట్లలో సింహభాగం కాపు, తూర్పు కాపు, బలిజ, మున్నూరు కాపు సామాజికవర్గాలవే. చిరుకు ఈ సామాజికవర్గాల్లో ఉన్న పట్టు గ్రహించిన తర్వాతే.. చిరంజీవిని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని వైఎస్ స్వయంగా సోనియాకు లేఖ రాశారు. ఆ మేరకు ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంతో పాటు, చిరుకు రాజ్యసభ ఇచ్చి, ఆయన పార్టీ వారికి రెండు మంత్రి పదవులు కూడా బహుమతిగా ఇచ్చారు. కానీ, ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ నేతగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఆ సామాజిక వర్గాలు మునుపటి మాదిరిగా బ్రహ్మరథం పట్టడం లేదు. పాయకరావుపేటలో జనం లేకపోయేసరికి మంత్రి గంటాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, జగన్‌పార్టీ- టీడీపీ రెడ్డి అభ్యర్ధులను నిలబెట్టిన చోట మాత్రం బలిజ వర్గం.. కులం కోణంలో చిరు వైపు మొగ్గుచూపుతోంది. ఆళ్లగడ్డలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆళ్లగడ్డలో బలిజ వర్గం అభ్యర్ధి ఎవరూ లేకపోవడంతో ఆ వర్గీయులు చిరంజీవి వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఆళ్లగడ్డలో బలిజలు కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్నారు. ఇది జగన్ పార్టీ అభ్యర్ధి శోభానాగిరెడ్డికి కొంత మైనస్ పాయింటని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more