రాష్ట్రపతి ఎన్నికల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అయిన వెంటన .. రెండు సమస్యలకు తెర దించటానికి సిద్దంగా ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఒకటి తెలంగాణ సమస్య. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. ఈ రెండిటిపై కసరత్తు చెయ్యటానికి సిద్దంగా ఉందని ఢిల్లీ మీడయా అంటుంది. అయితే.. తెలంగాణ గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు సిఎం పదవి గురించి తెలుసుకుందాం. రాష్ట్రానికి ఇప్పుడు సిఎం గా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను , రాబోయే రోజుల్లో పార్టీ బలంగా ఉండలాంటే.. రాష్ట్రానికి కొత్త నాయకుడు అవసరముందని సోనియాగాందీ ఢిల్లీ నాయకులతో అంటుందట. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే చాలు, ఆ పార్టీ నుంచి ఎవరైనా సీఎం కావొచ్చు. కావాలనుకుంటే ఇతర పార్టీల్లోంచి నేతల్ని తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో వారికి పదవులు కట్టబెట్టిన దాఖలాలూ కూడా ఉన్నాయి గనుక, ఆ పదవీ ఈ పదవీ అన్న తేడా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైన , ఎలాంటి పదవులైనా దక్కేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడీ పదవుల పందేరం దేనికీ ? అంటే , రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక మార్పులు జరగనున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇప్పుడు మార్పు ఏ విభాగంలో పార్టీ అధ్యక్షుడా, లేక ప్రభుత్వ అధినేతా , ఎవరు మారతారన్నది ఆసక్తికరంగా మారిందిక్కడ. సీఎం కిరణ్ ని ఆ పదవిలోంచి తప్పిస్తే , పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ముఖ్యమంత్రి పదవికి రేసులో అందరికన్నా ముందుంటారు. అలాగని, ఆయనకు ఆ పదవి దక్కుతుందా? అంటే, ఆయనపైనా చాలా వ్యతిరరేకత ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జానారెడ్డి పేరు వినపడుతుంది. కానీ మహిళా కోటాలో గీతారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అలా కాకుండా కాంగ్రెస్ లో విలీనమైన పీఆర్పీ ఖాతాలో చిరంజీవి సీఎం పదవి ఇస్తే? ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ డజను మంది వరకూ సీఎం పదవి కోసం క్యూలో కనిపిస్తారు కాంగ్రెస్ పార్టీలో. వీరిలో పార్టీ ప్రతిష్టను నిలబెట్టేదెంతమంది? అంటే , దానికి సమాధానం అంత తేలిక కాదని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో గ్లామరుంటే , పార్టీలో పాపులారటీ వుండదు. పార్టీలో పేరుంటే జనంలో గ్లామరుండదు. సో .. ప్రస్తుతానికి రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులు జరిగితే జరగొచ్చు , లేకపోతే లేదు. ఎందుకంటే సీఎం పదవి విషయంలో మాత్రం కాంగ్రెస్ రిస్క్ చేసే అవకాశం లేదని ఢిల్లీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కానీ అధిష్టానం ఎప్పుడు ఎలా ఉంటుందో .. ఎవరికి తెలుసు?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more