జైల్లో ఉన్న జగన్ బయటి విషయాలను ఎప్పటి కప్పడు తెలుసుకుంటున్నారు. కేంద్రం తీసుకొని నిర్ణయాలను జగన్ ముందుగానే పసిగడుతున్నాడు. .. తెలంగాణ పై వస్తున్నా ప్రకటనలకు జగన్ కొంచెం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం రాయల తెలంగాణకు సై అంటే జగన్ మాత్రం నో చెప్పాటానికి సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వైయస్ జగన్ వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను తాము అంగీకరించే ప్రసక్తేలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర విభజన జరగాలి తప్ప రాజకీయ మనుగడలేని పార్టీలకు లబ్ది చేకూరేలా విడదీస్తే తాము ఆంగీరించబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అన్నారు. సీబీఐ జేడీ, చంద్రబాల ఫోన్‌కాల్స్‌పై సీఐడీతో విచారణ జరిపించాలంటూ ఆ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, కె.కె.మహేందర్ రెడ్డి డీజీపీ కార్యాలయానికి వ చ్చారు. ఇటు తెలంగాణ ప్రజలుకానీ, అటు రాయలసీమ ప్రజలు కానీ రాయల తెలంగాణకు సుముఖంగా లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని నిర్ణయిస్తే కచ్చితంగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే ఇవ్వాలని ప్రభుత్వ విప్ టి. జగ్గారెడ్డి కోరారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మూడు నెలల్లోగా వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించడం అర్థరహితమని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందునే రాష్ట్ర విభజన అంశంలో జాప్యం జరుగుతోందన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేయడం కెసిఆర్ అనుకున్నంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అంతర్గతంగా, బహిర్గతంగా బలహీనపరిచి తెలంగాణలో తానొక్కడినేనని నిరూపించుకునేందుకు కెసిఆర్ తాపత్రయవడుతున్నారని విమర్శించారు. 2014లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు కెసిఆర్ కుట్రపన్నుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు కలిపిన తెలంగాణ ప్రాంత విముక్తే ధ్యేయంగా తెరాస పోరాడుతుందని, రాయల తెలంగాణను అంగీకరించేది లేదని ఆ పార్టీ శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మాట్లాడారు. రాయల తెలంగాణ తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. తెరాస, ఈ ప్రాంత ప్రజలు నాటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more