పార్టీ లో డబ్బు పోయిన ఒకరు, మరొకరు .. రెండోసారి పదవి కోసం ప్రయాత్నలు , ఇంకొకరు తమ కులం కోసం పదవి కోరుకుంటున్న నాయకుడు. వీరిలో ఎవరికి ఆ పదవి దక్కుతుందో .. ఆ ఏడు కొండల వారి మీదనే భారం ఉందని సామాన్య ప్రజలు అంటున్నారు. పదవిలో ఉన్నది ఏడాదే, రెండోసారి కొనసాగిస్తే వెంకటేశ్వరుడి సేవకుడిగా తరిస్తానంటున్నాడు కనుమూరి బాపిరాజు !జీవితంలో ఒక్కసారైన ఏడుకొండల వాడి సేవకుడిగా అవకాశం ఇస్తే…నేను మా కులపోళ్లు సంతోషిస్తామంటున్న రాయపాటి సాంబశివరావు ! కాంగ్రెస్ లోని త్యాగధనుల్లో సోనియా గాంధీ తర్వాతి స్థానం తనదేనని, అల్రెడీ ఉన్న అనుభవానికి, మొన్న నష్టపోయిన కోట్ల రూపాయలకు సత్కారంగా టీటీడీ చైర్మన్ గిరి ఇవ్వాంటున్న సుబ్బరామిరెడ్డి ! మామూళుగా టీటీడీ చైర్మన్ పదవి కాలం రెండేళ్లు…కానీ ఆఖరి ఏడాది లో చాన్స్ సంపాదించుకొన్నాడు ఎంపీ కనుమూరి బాపిరాజు. ఏడాది పదవీ కాలంలో ఈయన తిరుపతిలో కంటే…విదేశాల్లో శ్రీనివాసుడి కళ్యాణాలు చేయిస్తూనే ఎక్కువ కాలం గడిపాడు. ఈ నేపథ్యంలో ఇంకా అమెరికాలో పెండింగ్ ఉన్న కళ్యాణాలు పూర్తి చేయించాలని కనుమూరి బాపిరాజు పరితపిస్తున్నాడు. ఇందుకోసం బాపిరాజు చిదంబరాన్ని కలిసి తన కోరికను చెప్పుకొన్నాడు.
పనిలో పనిగా కొత్త రాష్ట్రపతిని కూడా ఈ విషయంలో మేడమ్ కు రెకమెండ్ చేయమని కోరి, ఒకసారి వెంకటేశ్వరుడి దర్శనానికి ఆహ్వానించాడు. ఇక నెల్లూరు ఎంపీ ఎన్నికలో లెక్కలేనన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొన్నానని, ఓడిపోతానని తెలిసి పోటీ చేసి త్యాగధనుడిగా నిలిచిన తనకు ఇప్పుడప్పుడే మంత్రి పదవి లభించే అవకాశం లేదు కాబట్టి, తన పూర్వశ్రమమైన టీటీడీ చైర్మన్ పదవినిస్తే శ్రీనివాసుడి సేవలో తరిస్తానని అంటున్నాడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి. ఇక కమ్మ వాళ్లకు కాంగ్రెస్ గౌరవం ఇస్తోందనే గుర్తింపు రావాలంటే తనను ఆదరించాల్సిందే అని పదేపదే చెబుతున్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు టీటీడీచైర్మన్ పదవిపై కన్నేసినప్పటికీ…తారాచౌదరి వ్యవహారంలో ఆయన పేరు నలగడం ఆయనను ఈ పదవికి దాదాపుగా దూరం చేసిందనే చెప్పాలి. ఇక టీటీడీ పాలకమండలి సభ్యులు కూడా తమ పదవిని పొడిగించడానికి ప్రయత్నాల్లో మునిగిపోయారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more