రాష్ట్రంలో ఇప్పుడు చర్చ చిరంజీవి గురించే జరుగుతుంది. చిరంజీవిని కాంగ్రెస్ మోసం చేసింది? అనే గాసిప్స్ పుట్టాయాని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఈ వ్యవహారం పై పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనలో ఇప్పటి వరకు నెగెటివ్ ఆలోచనలు లేనట్లు కనబడటం విశేషమాని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పుకారు షికారు చేస్తోంది. చిరంజీవికి కాంగ్రెస్ .. రాష్ట్రానికి సంబంధించిన కీలక పదవి ఇవ్వటానికి సిద్దమైనట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. కీలక పదవి అంటే .. ఒకటి ముఖ్యమంత్రి , రెండు పీసీసీ అధ్యక్ష పదవి. ఈ రెండిటిలో ఏదో ఒకటి చిరంజీవికి ఇవ్వటానికి కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం సీఎం పదవి ఖాళీగా లేదని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఇక మిగిలింది .. పీసీపీ అధ్యక్ష పదవి గురించి ఆలోచిస్తే .. దాని కన్నా చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకోవటంమే ముఖ్యమాని భావిస్తున్నారట. కాంగ్రెస్ లో ఎప్పుడెలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి సి.రామచంద్రయ్య కాపు సామాజికవర్గ సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి , ఆ తర్వాత సర్దుకున్నారు.
మళ్లీ ఇప్పుడు బొత్స తిరుపతిలో మాట్లాడుతూ చిరంజీవి ముఖ్యమంత్రి కోరుకోవడంలో తప్పు లేదన్నారు.అయితే ముఖ్యమంత్రి ని చేయదలిస్తే చిరంజీవిని రాజ్యసభకు ఎందుకు పంపారో తెలియదు. లేదా రాష్ట్ర విభజన జరిగితే అప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పడమో తెలియకుండా వీరు మాట్లాడుతున్నారు.ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితం కాగా, ఆ తర్వాత పరిణామాలలో చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.స్వయంగా బొత్సనే ఆ విషయాన్ని గతంలో అధికారికంగా ప్రకటించారు.కాని ఇంతవరకు అది జరగలేదు. ముందుగా ఆ కేంద్ర మంత్రి పదవి చిరంజీవికి వచ్చేలా చేయగలిగితే అదే పదివేలు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించవచ్చేమో!కాగా త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని బొత్స తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more