తన సోదరుడిని పార్టీ నేతలు విమర్శించడాన్ని సహించ లేకనే తాను జగన్ పార్టీలోకి వెళుతున్నానన్న వై ఎస్ వివేకానందరెడ్డి దారిలోనే కేవీపీ రామచంద్రరావు పయనిస్తున్నారా? అందుకే వైఎస్‌కు సరైన గౌరవం దక్కడం లేదని బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లేక కాంగ్రెస్ లోని వైఎస్ వర్గాన్ని ఏకం చేసి, తానే ఒక కొత్త నేతగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు కేవీపీ కాంగ్రెస్‌లో ఉంటారా? జగన్ పార్టీలోకి జంపయిపోతారా? ఇటు సొంత పార్టీ వారు నమ్మక, అటు జగన్ పార్టీ నేత సురేఖ వంటి నేతల విమర్శలు ఆగక ఏం చేయాలో పాలుపోని కేవీపీ అడుగులు ఎటు? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న సందేహాలివి. కాంగ్రెస్‌లో వైఎస్ ఫొటోకు, స్మరణకు సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదంటూ ఆవేదన, అసం తృప్తి వ్యక్తం చేసిన కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్‌లో కొనసాగుతారా? జగన్ పార్టీలో చేరేందుకే వివేకానందరెడ్డి మాదిరిగా ముందస్తు రంగం సిద్ధం చేసు కుంటున్నారా? అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో వైఎస్ పేరు ప్రస్తావించవలసిన పనిలేదని, కావాలనే ఆయన పేరు ప్రస్తావిం చడం ద్వారా, కాంగ్రెస్‌లో మిగిలిన వైఎస్ విధేయులకు నాయకత్వం వహించి, తానే ఓ వర్గ నాయకుడిగా అవతరించాలన్నదే కేవీపీ అసలు వ్యూహమని కొందరు నేతలు అనుమానిస్తున్నారు. దానితో ఢిల్లీలో తనకున్న పలుకుబడిని వినియోగించుకుని, వైఎస్ మాదిరిగా ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలన్నదే ఆయన అసలు కోరిక అని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ విధంగా మరికొన్ని రోజులు సందర్భానుసారం వైఎస్ గురించి ప్రస్తావించి, చివరకు జగన్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని కాంగ్రెస్ సీనియర్లు జోస్యం చెబుతున్నారు. వైఎస్ వివేకాతో పాటు, మరికొందరు సీనియర్లు కూడా ఇదే సాకు చూపి జగన్ వైపు వెళ్లారంటున్నారు. అసలు ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, అధి కార ప్రతినిధుల్లో మెజారిటీ శాతం ఒకనాడు కేవీపీకి సన్నిహితులేనని, ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారేనని గుర్తుచేస్తున్నారు. వీరిని కేవీపీయేనే జగన్ పార్టీలోకి పంపించారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆ మేరకు ఆయన వ్యతిరేక వర్గం ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలి సిందే. జగన్‌కు కేవీపీ అసలు సిసలు కోవర్టని సీనియర్ ఎంపీ మధుయాష్కీ, వి.హన్మంతరావు ఆరోపించారు.
జగన్ పార్టీ విధానకర్త ఆయనేనని మధు యాష్కీ స్పష్టం చేశారు. అయితే, జగన్ పార్టీలో కూడా కేవీపీ పట్ల అంతపెద్ద సానుకూల వాతావరణం లేనట్లు కనిపిస్తోంది. వైఎస్ ఫొటో లేదని కేవీపీ చెప్పడం చూస్తే నవ్వాలో బాధపడాలో తెలియడం లేదని వైకాపా నేత కొండా సురేఖ వ్యాఖ్యానించారు. జగన్ పై సీబీఐ దాడులు చేస్తున్నప్పుడు, ఆయన కుటుంబాన్ని అవమానించినప్పుడు కేవీపీ ఎక్కడ ఉన్నారని కొండా దుయ్యబట్టిన విషయం తెలిసిందే. గతంలో ఆమె కేవీపీని తూర్పారపడుతూ ఒక లేఖ సంధించారు. దానికితోడు.. కేవీపీని నమ్మడానికి వీల్లేదని, ఆయన వల్లే తాము చాలా నష్ట పోయామని కొందరు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో తన రాజకీయ ఉనికి కోసమే వైఎస్ ఫొటో లేదని బాధపడుతున్నారని, అంతేతప్ప ఆయనకు వైఎస్ పై ప్రేమ లేదంటున్నారు.దీనితో జగన్ శిబిరం కూడా కేవీపీని అంతగా నమ్మడం లేదని స్పష్టమవుతోంది. ఇటు సొంత కాంగ్రెస్ లోనూ దాదాపు అదే పరిస్థితి. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని, సీఎం, పీసీసీ అధ్యక్షుడిని జగన్ పార్టీ తిట్టి పోస్తున్నా కేవీపీ ఇంతవరకూ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంతో సహజం గానే ఆయన జగన్ కోవర్టుగా ముద్ర పడవలసి వచ్చింది. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వి.హన్మంతరావు, రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి నేతలు జగన్‌పై విరుచుకుపడు తున్నా, అదే హోదాలో ఉన్న కేవీపీ మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడక పోవడమే ఆయన చిక్కుల్లో పడటానికి అసలు కారణం. ‘అంటే తాను మౌనంగా ఉండటం ద్వారా అటు జగన్‌ను మెప్పించడం, ఇటు వైఎస్ ఆశయాల కోసం పనిచేస్తున్నానని కాంగ్రెస్‌లోని వైఎస్ విధేయుల వద్ద మార్కులు కొట్టేసే అతి తెలివితేటలన్న మాట. మిగిలిన ఎంపీలంతా తిడుతున్నా తానొక్కడినే మౌనంగా ఉంటున్నానని జగన్‌కు చెప్పడమే కేవీపీ మౌనం వెనుక అసలు కారణం. నిజంగా కేవీపీకి సోనియా పై విధేయత, విశ్వసనీయత ఉంటే ఆనాడే జగన్, విజయమ్మ చేసిన ఆరోపణలను ఖండించేవారు. ఆ విధేయత లేకనే జగన్‌ను తిట్టకుండా మౌనంగా ఉంటు న్నార’ని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more