చాలా కాలంగా హిట్లు లేక సతమతమైన పవన్ కళ్యాణ్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాని రీమేక్ చేసి తెలుగులో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయంతో పవన్ కళ్యాణ్ సల్మాన్ ఖాన్ నటించిన ఏక్తా టైగర్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలని అనుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఆ చిత్రం సెట్స్ లో ఉండగానే వచ్చింది. ఈ సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది బాలీవుడ్ లో. ఎప్పటి నుండో దీని పై కన్నేసిన పవన్ కళ్యాన్ రీసెంటుగా ఈ చిత్రాన్ని చూశాడు.
సినిమా చూసి, దానిని రీమేక్ చేసే ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. అందులో విషయం కన్నా యాక్షన్ పాళ్ళు ఎక్కువగా ఉందనీ, అది తెలుగు ప్రేక్షకులకు నచ్చదనీ నిర్ణయించుకోవడంతో పవన్ ఆ సినిమా రీమేక్ అంశాన్ని వదిలేశాడని అంటున్నారు. దీని బదులుగా ప్రస్తుతం సెట్స్ లో వున్న 'దబాంగ్-2' సినిమా మీద వీరు ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. అందులో విషయం ఉందనీ, తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్న ప్రకాష్ రాజ్ ఇప్పటికే పవన్ కల్యాణ్ సన్నిహితులకు చెప్పాడట. అందుకే, 'గబ్బర్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా మీద దృష్టి పెట్టాడు. పవన్ కల్యాణ్ కి కనుక 'దబాంగ్ -2' నచ్చితే, ఎంత రేటు పెట్టయినా, ఆ హక్కులు తీసుకుని, 'గబ్బర్ సింగ్ -2' చిత్రాన్ని నిర్మిస్తానని ఆయన చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more