దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు భారీ ఎత్తున అభిమానులు జరుపుకున్నారు. రజనకాంత్ కు అనేక మంది ప్రముఖులు పుట్టిన రోజు శుభాకంక్షాలు చెప్పనట్లు తెలుస్తోంది. అయితే రజనీ ఇంత ఎత్తు ఎదగటానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారట. రజనీకాంత్ కు గురువు కంటే గొప్ప వ్యక్తి ఉన్నారని చెబుతున్నారు. రజనీకాంత్ విజయం వెనక ఉన్న వ్యక్తి ఎవరో కాదు. నటుడు కమల్ హాసన్. కమల్ హసన్ ని చూసి రజనీకాంత్ నేర్చుకోవటం జరిగిందని ఆయన చెబుతున్నారు. ఆయన పేరు సంపాదించుకోవటానికి కారణం కమల్ హాసన్ అని రజనీకాంత్ నవ్వుతు చెబుతున్నారు. కమల్ హాసన్ నటన చూస్తూ నేను ఒక నటుడిగా ఎదిగానని ఆయన అన్నారు. కమల్ హాసన్ నటనను దగ్గర నుంచి చూసే అద్రుష్టం కూడా నాకే దక్కింది. అందుకే నేను ఇంతవాడినయ్యానని రజనీ అంటున్నారు. ఒకసారి అవర్ గళ్ సినిమా షూటింగ్ లో నేను బయట కూర్చుని ఉన్నా. ఆ విషయం నా గురువు గారు బాలచందర్ గమనించారు. వెంటన నన్ను లోపాలి పిలిచి చాలా కోపంతో తిట్టడం జరిగింది. బయటకు ఎందుకు వెళ్లావు? సిగరెట్టు తాగటానికి బయటకు వెళ్లావా? అని ఆయన సీరియస్ గా అరిచి సెట్ లోపల కమలహాసన్ నటిస్తున్నాడు.నీవు వెళ్లి జాగ్రత్తగా గమనించు. అలా గమనిస్తేనే నీ నటన మెరుగుపడుతుందని బాలచందర్ ఆవేశంగా చెప్పటం జరిగిందట. వెంటన రజనీ కాంత్ సెట్ లోకి వెళ్లి కమల్ హాసన్ నటనను గమనిస్తూ ఒక ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. కమల్ నటిస్తుంటే నేను కదలకుండా చూస్తూ.. కమల్ హాసన్ ఉన్న ఇండస్ట్రీలో నేను కూడా పేరు సంపాదించుకోవాలంటే భిన్నమైన మార్గం ఎంచుకోవాలి.. అతనిలా నేను నటించకూడదని ఆరోజే నిర్ణయించుకోవటం జరిగిందట.
అందుకే అప్పటి నుండి అతను చేసిన పాత్రలేమీ నేను చేయలేదు, అతనిలా ఉండటానికి ప్రయత్నించాను. నాలో ఉన్నకొద్దిపాటి తెలివితేటలు ఉపయోగించి..నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ కొద్ది పాటి తెలివితేటలు ఉపయోగించి తీసుకున్న నిర్ణయం నా విజయానికి కారణమయిందని రజనీ కాంత్ నవ్వుతూ చెబుతున్నారు. అంతేకాకుండా నాలో ఉన్న వేగమే నాబలం? బాలచందర్ కు నాలో బాగా నచ్చింది స్పీడ్. ఆ స్పీడ్ ను ఎప్పడూ కోల్పోవద్దని ఆయన చెబుతూండేవారు. ఈ స్పీడ్ నాకు మొదటి నుంచి ఉందని చెబుతున్నారు. రజనీ బస్సు కండక్టర్ గా ఉన్నప్పుడు కూడా బస్సులో వంద మంది ఉన్నా పది నిమిషాల్లో అందరికీ టిక్కెట్లు కట్ చేసే వాడినని రజనీ చెబుతున్నాడు. ప్రతి విషయాన్ని చాలా వేగంగా పూర్తి చేసి వేరే పనికి వెళ్లిపోవాలనిస్తుంది.. అసలు నా జీవితమే అంతా చాలా మంది రజనీని రిలాక్స్ కావద్దని, పనిచేస్తునే ఉండమని చెబుతుంటారు. నాకు జీవితాంతం నటించాలనే ఉంది. అయినే నేను శివాజీ గణేషన్ కాని కమల్ హాసన్ కాని కాదు. నాకు వాళ్లకున్నఅలాంటి నటనా పటిమ లేదు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించలేను. ఒక హీరోగా నా బలం నా స్పీడే. అది తగ్గిపోతే నేను నటించటం అనవసరం అని రజనీ అన్నారు. అయితే నాకు ఆ స్పీడ్ ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటానని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more