డాక్టర్ మెగా స్టార్ చిరంజీవి తెలుగు తెరపై ఎన్నో పోరాటాలు చేసే తీరు చూస్తే.. నిజంగానే ఆయన శత్రువుల భరతం పడుతున్నాడేమో అనిపిస్తుంది. సాధారణంగా పోరాట సన్నివేశాల్లోనూ. ఒళ్లు గగ్గుర్పొడిచే సన్నివేశాల్లోను డూప్ ను వాడుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం చాలా సందర్బాల్లో డూప్ కి అవకాశం ఇచ్చేవాడు కాదట. ఎంత రిస్కీ ఫైట్ అయినా తాను చేస్తేనే అది అభిమానులకి కిక్ ఇస్తుందని భావించి అందుకు సిద్దపడేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నోసార్లు గాయపడ్డారు. హిందీలో ‘జెంటిల్ మెన్’ సినిమా షూటింగ్ సమయంలోన ఆయన ఓసారి గాయపడ్డారు. ఈ సినిమాలో కథానాయకుడి ఎడమ చెయి జబ్బకి బుల్లెట్ గాయమౌతుంది. ఆ బుల్లెట్ ని బయటికి తీసి .. ఆ బాధను నివారించుకోవడానికి సిద్దపడతాడు. ఇందుకోసం బుల్లెట్ గాయంపై గన్ పౌడర్ చల్లి అంటించుకోవాలి. అప్పుడు ఒక్కసారిగా మెగ్నీషియం వెన్నముద్దలా వెలుగుతూ పైకి లేచి అనుకున్న ఎప్టెక్ట్ వస్తుంది. ఈ షాట్ ని డూప్ తో చేయిద్దామని దర్శకుడు మహేష్ భట్ ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా తానే చేస్తానంటూ చిరంజీవి పట్టుబట్టాడు. అయితే ప్రమాదకరమైన ఆ సన్నివేశాన్ని తాను చూడలేనంటూ ఆయన బయటికి వెళ్లిపోయారు. దాంతో ఇటు స్పెషల్ ఎఫెక్ట్ నిపుణుడిని.. అటు డాక్టర్ ను పిలిపించి చిరంజీవి ఆ షాట్ లో పాల్గొన్నాడు. కెమెరా రన్ అవుతోంది. చిరంజీవి ఎడమ చెయి జబ్బపై మంట పైకి లేస్తోంది. .. బాధని భరిస్తూ , ఆసీన్ లో నటిస్తున్నాడు. .. అయితే షాట్ చాలా బాగా వచ్చింది. కానీ కరెక్ట్ సమయంలో కట్ చెప్పే దర్శకుడు అక్కడలేకపోవటంతో ఎంత సేపటికి కట్ చెప్పలేదట. కట్ చెప్పే దర్శకుడు లేడనే విషయం చిరంజీవి అప్పుడు గుర్తుకు రావడంతో వెంటనే మరో చేత్తో ఆ మంటను ఆర్పేసుకోవటం జరిగిందట. కానీ అప్పటికే ఆయన జబ్బపై పెద్ద బొబ్బ ఏర్పడింది. ఆ గాయం ఆయనను కొన్ని రోజుల పాటు బాధపెట్టిందట. ఇలా ప్రేక్షకకులను ధ్రిల్ చేయడం కోసం చిరంజీవి చేసిన సాహసాలే ఆయనని ఈ స్థాయికి చేర్చాయని చెప్పటడంలో ఎలాంటి సందేహంలేదు. కష్టం నీ ఆయుధం అయితే .. విజయం నీ బానిస అవుతుందని మంత్రి చిరంజీవిగారిని చూస్తే తెలస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more