ఇటీవల కాలంలో హిందు మతం పై అసభ్యకర వ్యాఖ్యలు వార్తలోకె కెక్కిన రాజకీయ పార్టీ ఎంఐఎం పార్టీ. ఆ పార్టీ అధినేత పై కూడా పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఎంఐపార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో హిందువులు ఆగ్రహంతో రగిలిపోయారు. అక్బరుద్దీన్ మాట్లాడిని మాటల వలన రాష్ట్రంలో కొత్త అలజడి మొదలైంది. అయితే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కలిసి కాపురం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో విభేదాలు రావటంతో ఆ పార్టీ నుండి విడాకులు తీసుకోని .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబందాలు పెట్టుకున్నట్లు ఇటీకాలంలో పుకార్లు వినిపించాయి. ఆ పార్టీ అధినేత మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వైఎస్ జగన్ తో మంతనాలు జరపటంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోపం ఊగిపోయినట్లు సమాచారం. అది మనసులో పెట్టుకొని మా పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తో 14 సంవత్సరాలు కాపురం చేసిన మాపై ఇలా కుట్ర చేస్తారా ఆయన అడుగుతున్నారు. అసలు సీఎం కిరణ్ కంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా మంచి నాయకుడు. అలాంటి నాయకుడికి మేము మద్దతు ఇవ్వలేదు. కారణం చంద్రబాబు నాయుడు బీజేపికి మద్దతిచ్చారనే ఏకైక కారణం వల్ల చంద్రబాబుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఎంపీ అసదుద్దీన్ చెబుతున్నారు.
అలాంటి చంద్రబాబునే అధికారం నుంచి కిందకు దించటానికి కాంగ్రెస్ కలిసి పనిచేసినట్లు ఆయన చెబుతున్నారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జ్నానం చాలా తక్కువని ఎంపీ అంటున్నారు. అందుకే మేమూ కూడా తెలుగు నేర్చుకుంటున్నాం. తెలుగు మాట్లాడలేకపోవడం మాకు పెద్ద లోపం. అసలు మా భావం ఏమిటనేది ప్రజలకు అంతగా చేరడం లేదు. అందుకే ఒక సంవత్సరంలోగా తెలుగు నేర్చుకుని , స్పష్టంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. తెలుగు నేర్చుకోవడం కోసం ఒక ట్యూటర్ ను కూడా పెట్టుకున్నాను. అంతేకాదు.. ముస్లింలతో పాటు దళితులు.. ఓబీసీలను చేర్చుకోవాలనేది మా ఉద్దేశం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో లా రాజకీయ పరిస్థితులను ఆంద్రఫ్రదేశ్ లో స్రుష్టించాల్సి ఉంది. ఎందుకుంటే ఈ వర్గాలు వెనుకబడటానికి కారణం వారికి రాజకీయ అధికారం లేకపోవడమే కారణం అని ఎంపీ అసదుద్దీన్ చెబుతున్నారు. అయితే 2014లో మాత్రం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఆయన చెప్పలేదు. గానీ ఆ పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబుకే మద్దతు ఇవ్వటానికి సిద్దమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more