వినాశకాలే విపరీతబుద్ది అని సరిపెట్టు కోవాలా లేక ''కలికాలం'' అని మెట్ట వేదాంతం అలవర్చుకోవాలా. ఇతర అన్ని వ్యవస్థలలాగే మన కుటుంబ వ్యవస్థకు కూడా గ్రహణం పట్టింది. ఆనాడు కుటుంబంలోని వారందరూ పరస్పరం గౌరవంతో, ప్రేమాభిమా నాలతో పాటు పెద్దల యొక్క మార్గంలో జీవిస్తూ వృత్తి ధర్మాలను, కులధర్మాలనూ పాటిస్తూ, జీవి తాన్ని, ప్రకృతి వనరులను ప్రసాదించిన పరమాత్మను ఆరాధిస్తూ తమకు తమ కుటుంబాలకు, వంశానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. కానీ నేడు పూర్తిగా మారిపోయింది. తరతరాల సాంప్రదాయాలు, ఆచార విలువలను తుంగలో తొక్కి ఇవన్నీ 'ఈ కంప్యూటర్ యుగంలో కూడానా'' అని వెక్కిరిస్తూ, నాగరికంగా ఎదిగిపోతున్నాం అనుకుంటూ దిగజారుతున్నారు. ''విలాసాలకు అలవాటు పడటం, ధనాశ, పగ, ద్వేషాలు, పెంచు కోవడం లాంటి చేస్తున్నారు. ప్రజా నాయకుడిగా మంత్రి హోదాలో ఉండి కూడా సొంత కోడలపై వరకట్నం కోసం వేధించినట్లు తెలుస్తోంది. తమ కోడలు తనపై, తన కుటుంబ సభ్యులపై వరకట్న కేసును నమోదు చేయడంతో నైతిక బాధ్యతతో పదవి నుండి వైదొలగారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసానికి వెళ్ళిన మంత్రి రఘనాథ మహంతి అక్కడ తన రాజీనామా పత్రం అందచేశారు. బాలాసోర్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. రాజీనామా అందచేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తన కోడలు వర్షా సోనీ మొహంతి తమపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. గత రాత్రే ఈ కేసు నమోదైంది. విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని, ఈ ఆరోపణలన్నీ సరైనవి కావని ఆయన పేర్కొన్నారు. బాలాసోర్ జిల్లాలోని బస్తా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎంఎల్‌ఎగా ఆయన ఎన్నికయ్యారు.
గత 13ఏళ్ళ నుండి మంత్రిగా పలు పదవులను నిర్వహించారు. వివాహ సమయంలో తాను 10లక్షలు కట్నం ఇంకా ఇతరత్రా గృహౌపకరణాలు ఇచ్చినా కూడా అదనపు కట్నం కోసం రోజు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కోడలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. రోజు 25లక్షల నగదు, స్కోర్పియో వాహనం కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. పైగా ఈ నెల 13న తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నం కూడా జరిగిందన్నారు. ఒక పక్క మహిళల పై పట్టపగలే హత్యలు, ఆత్యాచారలు, జరుగుతున్న రోజులు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఒకపక్క మహిళ సంఘాలు గోల చేస్తున్నాయి. అధికారంలో ఉన్న మంత్రి ఇంట్లో ఉన్న మహిలపై జరుగుతున్న వేధింపులకు మహిళ సంఘలు మండిపడుతున్నారు. మహిళకు మంత్రిగారి ఇంట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more