ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఫిలింనగర్లో కొత్త వివాదాం లేపాడు. దాసరి వేసిన వ్యాఖ్యలు కొంత మంది ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల బాద్ షా ఆడియో ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆడియో ఫంక్షన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక అభిమాని మరణించటం పై ఫిలింనగర్ పెద్దలు షాక్ తిన్నారు. చాలా మంది ఆడియో ఫంక్షన్లు పై ఎన్నో కామెంట్ చేశారు, కానీ మీడియా ముందు ఎవరు కామెంట్ చేయాటానికి సహించలేదు. కానీ దాసరి నారాయణరావు మాత్రం ఆ సహాసం చేసి.. ఫిలింనగర్లో వివాదం రేపినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాను రాను ఆడియో ఫంక్షన్లు జాతర్లలో జరిగే రికార్టింగ్ డ్యానుల్లా తయారయ్యాని దర్శకరత్న దాసరి తీవ్రంగా కామెంట్ చేసినట్లు సమాచారం. అసలు ఆడియో ఫంక్షన్ ని ఎందుకు చేస్తున్నామనే అవగాహన నిర్మాతకు లేకుండాపోయిందని దాసరి మండిపడ్డారు. ఆడియో అనేది ఒక సినిమా విడుదల కావడానికి ఒక కర్టెన్ రైజర్. ఆడియో వేడుకల్లో రికార్డింగ్ డాన్సులు ఎవడు, ఎందుకు ఆడతాడో తెలీదు, మన సినిమా పాటలు మనం ప్రమోట్ చేసుకోవాలి కానీ, ఎవరి సినిమాలో పాటల్ని మనమెందుకు ప్రమోట్ చేయడని దాసరి మండిపడ్డారు.
మన సినిమాని జనం దగ్గరకు తీసుకు వెళ్లటానికి ఆడియో ఫంక్షన్ అనేది గుడ్ ఫ్లాట్ ఫామ్. మనం కష్టపడి తీసిన సినిమాని థియేటర్లలోకి, ఆడియోన్స్ లోకి తీసుకెల్లాంటే మనకు మీడియా ఒక్కటే మార్గం. మీడియా ద్వారానే ప్రజలకు మన సినిమా ఏమిటనేది చేరుతుంది. అంతేకానీ దాన్ని విడిచిపెట్టి మనం వింత పోకడలు పోతున్నాం అని దాసరి మండిపడ్డారు. ఇక మీదట డాన్యులతో , గిమ్మిక్స్ తోటీ ఎవరైనా ఫంక్షన్ చేస్తే వేళ్లకూడదని దాసరి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అసలు దాసరి ఇంతకీ ఎవర్ని టార్గెట్ చేసినట్లు అనే అనుమానం ఫిలింనగర్ పెద్దలకు, సినీజనాలకు రాకుండా ఉంటుందా చెప్పాండి? వారి అనుమానం ప్రకారం ఇద్దరి వ్యక్తులను దాసరి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకరు టాలీవుడ్ బడా ప్రొడ్యుషర్ అయిన బండ్ల గణేష్. మరొకరు జూనియర్ ఎన్టీఆర్ మీద దాసరి ఆక్రోశం వెల్లబుచ్చినట్లు ఫిలింనగర్ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. అయిన ఆడియో ఫంక్షన్లో డ్యాన్సులు , జిమ్మిక్స్ లు చేస్తే దాసరి వచ్చే నష్టం ఏమిటి? ఆయన ఇష్టం లేకపోతే ఫంక్షన్లకు రాకుండ ఉంటే సరిపోతుంది కదా? ఆయన వచ్చి ఎదుటివారి ఆనందం పై ఇలా సెటైర్లు వేయటం పెద్ద దర్శకుడికి మంచికాదని టాలీవుడ్ హీరోల అభిమానులు చాటు మాటుగా అంటున్నారని ఫిలింనగర్ లో పుకార్లు పుట్టాయి. ఇది అంత దాసరి నోటి దురదని కొంత మంది సినీ ప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more