ఆవేశంలో అరిచిన అరుపులకు ఉన్న పదవి పోయింది. కూర్చున్న చెట్టుకొమ్మపైనే గొడ్డలి వేటు వేసుకున్నా వారిలో మహా విచిత్రంగా మాట్లాడే మహా నాయకుడు . రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు. మీడియా మైకు కనిపిస్తే చాలు .. కేకే అరిచే అరుపులు ఎవ్వరికి అర్థం కావు, కానీ , ఒక్కటి మాత్రం అర్థం అవుతుంది. ఆయన ఏదో చెబుతన్నాడు అనే సౌండ్ వినబడుతుంది. . అలాంటి నాయకుడు ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసి, కాంగ్రెస్ పార్టీ తో తెగదెంపులు చేసుకోని గులాబీ బాస్ తో చెలిమి చెయ్యాటానికి సిద్దమయ్యారు.. అయితే తెలంగాణ కోసం కెకే 50 ఏళ్లుగా పోరాడుతున్నానన్న ఆయన, 2001లో వైఎస్ వ్యతిరేకించినా ప్రత్యేక రాష్ట్రం కోసం సంతకాలు సేకరించామని చెప్పారు. ఈ అంశాన్ని కాంగ్రెస్.. సీడబ్ల్యుసీలో చేర్చి, ఎన్డీయే ప్రభుత్వం ఎదుట తెలంగాణ డిమాండ్ లేవనెత్తేలా చేశామన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూశాక కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్థితిలో లేదని.. తెలంగాణ ప్రజలకు మోసం మాత్రమే కాదని..ద్రోహమూ చేసిందని అర్థమైందని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిగ సీట్లు దక్కించుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని పదే పదే చెబుతున్నా. కానీ, జాతీయ స్థాయి మీడియాలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. నా కుమారుడు జహీరాబాద్ నుంచి, నేను మరో చోట నుంచి పోటీ చేస్తామని వార్తలు ప్రసారం కావడం బాధనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయబోనని దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా. నేను చచ్చాకే నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తారేమో''నని వ్యాఖ్యానించారు. . అయితే కేకె గారు 50 సంత్సరాల నుండి తెలంగాణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ..? మరీ ఇప్పుడు కేకే మేలుకున్నారా? పదవులు అనుభవించినప్పుడు తెలంగాణ ఎందుకు గుర్తుకు రాలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .
ప్రజ బలం లేని కేకు కేంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చి ద్రోహం చేసిందా అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ‘ ఏ ఎండాకు ఆ గొడుకు పట్టే రకం కేకే అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు . ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసే నాయకుడైతే.. జాతీయ పార్టీ అయిన బీజేపిలోకి చేరి, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చెయ్యాలి గానీ, ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరితే అర్థం ఏమిటి? పదవి కోసమే టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు గా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . ఒక పక్క బీజేపి నాయకులు మేము అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తాం బాబో అంటూ గొంతుచించుకోని అరుస్తున్నా,
టీఆర్ఎస్ లో చేరే నాయకులు ఎందుకు పట్టించుకోవాటం లేదు? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . బీజేపిలో చేరితే పదవులు తక్కువు, ప్రజల బలం, తక్కువ. అదే టీఆర్ఎస్ పార్టీ అనుకోండి . తెలంగాణలో ఏ మూల నుండి పోటీ చేసిన తెలంగాణ సెంటిమెంట్ గెలిపిస్తుందనే భావన గోపీలకు బాగా అర్థమైంది. అంతేకాకుండా కేసిఆర్ 1+1 ఆఫర్ కొంత మంది నాయకులకు నచ్చి ఆ పార్టీ చేరుతున్నారని రాజకీయ పార్టీ లు అంటున్నాయి. . ఏమైన ఎలాంటి ఉపయోగం లేని కేకే ను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవటం టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు నచ్చలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more