మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ సినీ నటి విజయశాంతి ఈరోజు ఆమె తన 49వ పుట్టిన రోజును అనాధాశ్రమంలో చిన్నారుల మద్య జరుపుకున్నారు. చిన్నారులు మద్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే ఈ సమయంలో రాములమ్మ టిఆర్ఎస్ పార్టీ పై కొన్ని విషయాలు మీడియాకు తెలిపారు. మెదక్ ప్రజలను నన్ను ఎవరు దూరం చెయ్యలేరని విజయశాంతి కొంచెం ఘాటుగా అన్నారు. అంతేకాకుండా మెదక్ విషయం గురించి కేసిఆర్ అన్న నాతో ఎప్పుడు మాట్లాడ్లలేదనే రాములమ్మ అన్నారు. అయితే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవటం చాలా బాధకరంగా ఉందని ఆమె బాధపడ్డారు. ఇదే సమయంలో విలేకరు రాములమ్మను రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 అసెంబ్లీ, 16 పార్లమెంట్ సీట్లు వస్తాయాని పార్టీ నమ్ముతుందా? అంటే అసలు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అన్ని సీట్లు గెలుచుకోవటం చాలా కష్టమని రాములమ్మ చెప్పినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ కి పోటీగా బీజేపి , వైసీపీ లు తెలంగాణలో బలంగా ఉన్నాయాని ఆమె గుర్తుచేయటం జరిగింది. తెలంగాణకోసం మొదటి నుంచి తెలంగాణ ప్రజల పట్ల పోరాడుతున్న పార్టీగా బీజేపి ఇటీవల పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా బీజేపి అధికారంలోకి వస్తే మొదటి నెలలోపే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని జాతీయ పార్టీ చెప్పటంతో తెలంగాణ ప్రజలు బీజేపి ఓటు వేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రాములమ్మ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఒకేవేళ అన్నిస్థానాలు గెలుపొంది.. తెలంగాణ రావటం కష్టమని విజయశాంతి స్పష్టం చేశారు. జాతీయ పార్టీల మద్దతు ఉంటేనే తెలంగాణ సాద్యం అనే ఉద్దేశంతో రాములమ్మ చెప్పినట్లు సమాచారం. రాములమ్మ మాటలపై టిఆర్ఎస్ నాయకులు సీరియస్ గా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. రాములమ్మకు బిజేపిలో చేరి ఉద్దేశాన్ని ఇలా బహిరంగం చెప్పినట్లుగా ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రీసెంట్ టీఆర్ఎస్ సెకండ్ స్థానం కేకే కు కేసిఆర్ ఇవ్వటంతో.. టీఆర్ఎస్ నాయకుల్లో అంతర్గత మంటలు రంగుతున్నాయనే దానికి రాములమ్మ మాటలే నిదర్శనం అని సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more