ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు అనుమానం వస్తుందని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణల వ్యవహార తీరులపై సీమాంద్ర నాయకులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నల్లారి కిరణ్ ముఖం అంత నలుపు రంగుతో నిండిపోయి, నవ్వులేక వాడిపోయినట్లు గా మంత్రి టీజీ చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఈ ఇద్దరిపై సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ సమస్య పై ఇంత వేగంగా ఫైల్ కదిలినట్లు ఎక్కడ దాఖాలు లేవని అంటున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ వచ్చి రెండు నెలలు కూడా కాకముందే.. తెలంగాణ పై ఇంత త్వరగా కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు చర్చలు జరపలేదని సీమాంద్ర నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ స్పీడ్ వెనుక సీఎం కిరణ్ , పీసీసీ బొత్స హస్తం ఉందని సీమాంద్ర నాయకులు అంటున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలియకుండా పరిస్థితి ఇంతవరకు రాదని, అంత తెలిసే వీరు నాటకం ఆడుతున్నారని సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీ అంటున్నారు. కోర్ కమిటి ముందు సమైక్య నినాదం వినిపించానని చెబుతున్న పీసీసీ అద్యక్షుడు అంతర్గతంగా తెలంగాణ గురించే చెప్పారని సదరు ఎంపీ అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. బొత్స తో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏకీభవించి ఉండొచ్చన్నారు. రీసెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారరి జరుగుతున్న ప్రచారాన్ని కూడా తాను నమ్మడంలేదని వ్యాఖ్యానించారు. అసలు సీఎం సమైక్యావాది అయితే రాష్ట్రం కోసం , ఇప్పుడే చేసే రాజీనామాను మూడు నెలల క్రితమే చేసివుంటే ఇప్పుడు ఈ తలనొప్పులు ఉండేవి కావు, పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదికాదని కాంగ్రెస్ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సీఎం కు, బొత్సలకు రాష్ట్ర విభజన జరిగితేనే మంచిగా ఉంటుందనే ఉద్దేశంలో వీరు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more