జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎట్టపోతే మాకేందుకు …మాకు మా తెలుగు ప్రజలే ముఖ్యం అనే నాయకుడు ఎవరైన ఉన్నారా? అంటే.. సమాధానం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. తెలుగు జాతిని రెండుగా విడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ పై మన తెలుగు జాతి బిడ్డలు, తెలుగు నాయకులు , ఎందుకు యుద్దం చెయ్యరు? మన రాజకీయ నాయకుల్లో ఆ ధైర్యం లేదా? ముసుగులు ధరించిన నాయకులారా .. ఇకనైన మీ ముసుగులు తొలగించి తెలుగు జాతి కోసం, తెలుగు ప్రజల కోసం ఉద్యామించాలని .. తెలుగు ప్రజలు గొంతేత్తి అడుగుతున్నారు. పదవుల కోసమే ఇటలీ బుల్లెమ్మకు భజన చేస్తున్నా సీమాంద్ర నాయకులారా ఇకనైన మేలుకోండి? పదవి అనేది కొన్ని రోజులు మాత్రం, తెలుగు ప్రజల ప్రేమ శాశ్వతమైనదని తెలుసుకోండి. నిన్నటి వరకు సమైక్యాంద్ర ఉద్యమానికి జై కొట్టిన సీమాంద్ర నాయకులు చేతులు .. ఈ రోజు ఇటలీ బుల్లెమ్మ ఇచ్చే పదవుల కోసం, కాసుల కోసం, చేతులు చాచి అడుక్కుంటున్నారు. తెల్లవాడికి బుల్లెట్ కు ఎదురునిలబడి దమ్ముంటే కాల్చిండిరా అంటూ.. రొమ్ము విరిచి గుండెను చూపించి, తెలుగు జాతి ఒక్కటిగా ఉడాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి, తెల్లవాడి వంద బుల్లెట్లకు నేలకొరిగిన తెలుగువారి మన నాయకులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి? అప్పటి ఆ త్యాగమూర్తుల పేర్లు ఇప్పటికి నిలిచిపోయిన విషయం మరిచిపోవద్దు. పదవి కోసం పాకులాడే నాయకులారా... ప్రజలు తిరగబడితే , ప్రక్రుతి కన్నెర్రజేస్తే.. మీరు, మీ పదవులు ఏమౌవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి.
తెలుగుజాతిని విడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టపోతే మనకెందుకు? మన తెలుగు జాతే ముఖ్యం అని చెప్పండి? ఒక ప్రాంతం అభివ్రుద్ది పేరుతో విడిపోతే నష్టం జరిగేది ఎవ్వరికి మన తెలుగు జాతికే అన్న విషయం తెలుసుకోవాలి. తెలుగు జాతిని రెండుగా వీడదీస్తే, ఎక్కువగా లాభపడేది.. కాంగ్రెస్ పార్టీయే గానీ, తెలుగు ప్రజలకు ఎలాంటి లాభం లేదనే విషయం మన రాజకీయ నాయకులు తెలుసుకోవాలని సీనియర్ మేథావులు అంటున్నారు. ఈ రోజు ప్రాంతాల కోసం కొట్టుకుంటున్న మనం, భవిష్యత్తులో ఎన్మో యుద్దాలు చెయ్యాల్సిన అవరసం ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పటికే మన కళ్ల ముందు జరుగుతున్న తమిళనాడు , కేరళల మద్య నలుగుతున్న వాటర్ సమస్య తెలిసిందే. ఇలా ప్రతి దానికి యుద్దం చేసుకుంటూ పోతే.. చివరకు మిగిలేది ఏమిటి? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే మానవ జాతికే పూర్తి నష్టం జరుగుతుందని మేధావులు అంటున్నారు.
దీనికి చిన్న ఉదాహరణ. 400 ఏళ్ల నుండి హుస్సెన్ సాగర్ ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి మన హుస్సెన్ సాగర్ మంచి నీటి సాగర్ ప్రజలకు ఉపయోగపడింది. ఆలనాటి రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, పరిస్థితులు మారాయి. ఈ రోజు హుస్సెన్ సాగర్ లో ఉన్న కోట్ల టన్నుల నీరు ఒక్క చుక్క కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. కారణం మనమే మన చేతులారా మన హుస్సెన్ సాగర్ ను మురికి నీరుగా మార్చుకున్నాం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముందు చూపు లేకపోవటం ఈ రోజు మనం బాధపడుతున్నారు. ఇది కేవలం మన కళ్ల ముందు జరిగిన విషయమే కదా? అలాగే మన తెలుగుజాతి రెండుగా విడిపోతే నష్టం ఏమిటి? అని మన రాజకీయ నాయకులు అంటున్నారు. వారు ఏ ఫలితం ఆశించి అలా మాట్లాడుతున్నారో నాకైతే తెలియాదు. కానీ కలిసిగా ఉన్న తెలుగుజాతి విడిపోతే భారీ నష్టం జరుగుతుందని రాజకీయ మేథావులు, పండితులు, అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more