విభజన ప్రకటన సిడబ్ల్యూసి నుండి వెలువడి నాటి నుండి .. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులకు ఒంటి మీద బట్టలు నిలబడటంలేదు.. తెలంగాణ ప్రాంతం నాయకులు .. విభజన ప్రక్రియ త్వరగా జరిగిపోవాలని పూజలు, యగాలు, శాంతి ర్యాలీలు, సద్బావన సదస్సులు చేస్తున్నారు. ఇక సీమాంద్ర ప్రజలు మాత్రం రాష్ట్రం సమైక్యాంగా ఉంచాలనే ఉద్దేశంతో.. ఉద్యోగులు విడిచిపెట్టి, రోడ్డుపైనే దీక్షలు చేస్తున్నారు. ఇక సీమాంద్ర ప్రజలు అయితే.. 36 రోజలు నుండి ఒక్కటే పని. ఉదయం లేవటం.. సమైక్యాంద్ర కోసం ఉద్యమంలో పాలుపంచుకోవటం జరిగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యమాన్ని ఎవ్వరు చూసి ఉంటారని మేథావులు అంటున్నారు. సీమాంద్ర ఉద్యమం వెనుక ఒక నాయకుడు లేడు, ఒక రాజకీయ పార్టీ అండలేదు, అయిన సీమాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతుంది. సమైక్య సెగ ఢిల్లీ పెద్దలకుసైతం తాకిందంటే.. ఉద్యమం ఏ రూపంలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. జాతీయ పార్టీ, లోకల్ పార్టీల మద్య యుద్ద వాతావరణం నెలకొని ఉందని రాజకీయనాయకులు అంటున్నారు. లోకల్ పార్టీల నాయకులు మాత్రం సమైక్యా రాగం ఎత్తుకున్నారు. ఒకరు ఆత్మగౌరవం పేరుతో బస్సుయాత్ర చేస్తున్నారు. మరొకరు సమైక్యా శంఖారావం పేరుతో సీమాంద్ర ప్రజల మద్యకు వెళ్లటం జరిగింది. ఇక మిగిలింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర నాయకులు మాత్రం రోజు రకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఒకే మాటపై ఉన్నాట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే చాలు అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం , ఒకరు ఉత్తరాంద్ర ను తెలంగాణలో కలపాలి. లేదా వైజాగ్ ను రాజధానిగా చెయ్యాలని అంటున్నారు. మరొకరు తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చెయ్యాలని అంటున్నారు. బెజవాడ నాయకులు బెజవాడనే రాజధానిగా చేస్తే అందరికి బాగుంటుందని అంటున్నారు. మరికొంతమంది .. అసలు హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా చెయ్యండని మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు కవ్వింపు మాటలు మాట్లాడుతున్నారు. రాయల సీమ నాయకులు కర్నుల్ నే మళ్లీ రాజధానిగా చేస్తే ఎలాంటి ఇబ్బంది రాదని ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు మీడియా కవ్వింపు మాటలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కవ్వింపు మాటలు మానుకోని, రెండు ప్రాంతాల మద్య శాంతి చర్చలు జరుపుకుంటే అందరికి మంచిదని మేథావులు అంటున్నారు. లోకల్ పార్టీ రాజకీయ నాయకుడు నోటి దురుసు వలన.. కలిసి ఉద్యోగం చేసుకుంటున్న ఉద్యోగుల మద్య పెను చిచ్చు రగిలింది. ఆ పెనుచిచ్చు ఎంతవరకు వెళ్లిందంటే.. నిన్నటి వరకు కలిసి ఉద్యోగం చేసిన వారే.. ఒకరిపై ఒకరు చెయిచేసుకొని స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి దాపరించిందంటే.. పరిస్థితి ఎంత త్రీవస్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. అన్నదమ్ములు మాదిరిగా ఉన్న వారి మద్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ నాయకులు శ్రుతిమించకండి? సామరస్యంగా సంప్రదింపులు, చర్చలు , సదస్సులు, జరుపుకోండి అని రాజకీయ మేథావులు సలహాఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more