తెలంగాణ జాగ్రుతి అధ్యక్షరాలు కల్వకుంట్ల చంద్రఃశేఖర్ రావు కూతురు కవిత కనిపించటం లేదు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకొని సొంత ఇమేజ్ సంపాదించుకున్న కవిత మీడియా ముందుకు రావటంలేదు. బయట ఎక్కడ కూడా కనిపించటం లేదు. అందుకు కారణం తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పై విభజన ప్రకటన చేసిన నాటి నుండి కవిత చాలా అరుదుగా కనిపిస్తుంది. గతంలో అయితే ఎప్పుడు మీడియా కు అందుబాటులో ఉండి, తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది. కానీ ఇప్పుడు తెలంగాణ పై ఆశలు వదులుకోని ఇంట్లోనే ఉండిపోయినట్లు తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఏపీ ఏన్జీవోల సభను అడ్డుకుంటామని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరిశ్ రావు, ఈటెల రాజేంద్ర, స్వామి గౌడ్ మీడియా ముందు గొంతు చించుకుని అరుస్తున్నారు. కవిత మాత్రం చాలా సైలెంట్ గా ఉండటం పై అనేక అనుమానాలు రేకేత్తున్నాయి. కేసిఆర్ కొడుకు కేటిఆర్ కూడా ఏపీ ఎన్జీవోల సభ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యకుండా పార్టీ భవనంలోనే కాలం గడుపుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన కేసిఆర్, అక్కడ జరిగిన చర్చల అనంతరం. తన కుటుంబ సభ్యులకు కొన్ని సూచనలు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. తండ్రి చెప్పిన సూచనల మేరకు కవిత నడుచుకుంటుందని తెలంగాణ జేఏసీ నేతలు అంటున్నారు. ఈ విషయం పై వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల మండిపడుతున్నారు. కేసిఆర్ కుటుంబం రాష్ట్రం పై విషయం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో వైకాపా పార్టీ భూస్థాపితం అయ్యిందని టిఆర్ఎస్ నాయకులు అనటంతో.. షర్మిల మండిపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచటానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రమించారని, ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగితే ఎలా ఒప్పుకుంటామని కేసిఆర్ కుటుంబం పై షర్మిల నిప్పులు కురిపించారు. కేసిఆర్ సోనియా గాంధీ ఇచ్చే నోట్లకు అమ్ముడుపోయాడని, అందుకే ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావటంలేదని తీవ్రంగా విమర్శంచారు. కేసిఆర్ తెచ్చిన సూట్ కేసుల్లో హరిశ్ రావు వాటా అందలేదని అందుకు సీమాంద్ర ఉద్యమం, ఎపీఎన్జీవోల సభ పై విషం చిమ్ముతున్నారని అన్నారు. ఏమైన కేసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మద్దని షర్మిల చెప్పినట్లు సమాచారం. కేసిఆర్ నమ్మకండి, వైకాపాను నమ్మకండి, టిడిపి నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, .బిజేపిని నమ్మకండి.. అని ఆయా రాజకీయ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏ రాజకీయ పార్టీ నమ్మాలి? ఎందుకు నమ్మలి అని ప్రజలు అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఆయా పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయానే విషయం అందరికి తెలుసునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more