రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుండి తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు మౌనం పాటించారు. ఇలా మౌనంగా ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం గుర్తించిన తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు నిద్రలేచి దూకుడు పెంచటానికి సిద్దమవుతున్నారని టిడిపీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ విభజన ప్రక్రియ అనేది మా పార్టీ వలన జరిగిందని చెప్పుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం మా వలనే తెలంగాణ విభజన జరిగిందని తెలంగాణలో తీన్ మార్ వేస్తూ.. డప్పుకొంటున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన క్రెడిట్ అంత మా పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే విధంగా .. కమలం పార్టీ నాయకులు కూడా తెలంగాణ ప్రజల చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారు. అయితే అందరికంటే వెనకబడిపోయిన తెలంగాణ టిడిపి నాయకులు దూకుడు పెంచారు. తెలంగాణలో టిడిపి మీటింగ్ లు, యాత్రలు చెయ్యటానికి సిద్దమవుతున్నారు. అయితే ఈవిషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపిన తరువాత తెలంగాణ టిడిపి నేతలు దూకుడు పెంచుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు చేత కూడా తెలంగాణలో యాత్ర చేయించే ఉద్దేశం టిడిపి నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై సీమాంద్ర టిడిపి నాయకులు మాత్రం కొంచెం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టే అనే భావన తెలంగాణ ప్రజల్లో కలిగించే విధంగా తెలంగాణ టిడిపి నాయకులు, ఎర్రబెల్లి దయాకర్, మొత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర గౌడ్ లు త్వరలో తెలంగాణలో పాదయాత్ర చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి. వీరి పాదయాత్ర వలన తెలంగాణలో టిడిపి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more