గత వారం రోజుల నుండి సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమ సెగల తీవ్రత కేంద్రానికి తాకింది. ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమ సెగలు.. పక్కనే ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు సైతం తాకింది. ఉద్యమ తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పలంటే.. చాలా కష్టమని రాజకీయ మేధావులు తేల్చిచెబుతున్నారు. ఈ తీవ్రత ఇలాగే కొనసాగితే.. 2004 డిసెంబర్ 26న జరిగిన.. సునామీని మరోసారి .. మనం ప్రత్యేక్షంగా చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఉద్యమం తీవ్రత పెరటానికి కారణం ఎవరు? రెండు నెలలుగా ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రరూపం ఎందుకు దాల్చింది? దీని వెనుక ఎవరైన రాజకీయ గుండాలు ఉన్నారా? అంటే అది లేదు.. కేవలం ప్రజలే ఆగ్రహంతో ఊగిపోతున్నారు? వారికి ఆగ్రహానికి కారణం ఎవరు? అనే అనుమానం ఎవరికైన వస్తుంది. కానీ ఇలా జరగటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. సీమాంద్ర రాజకీయ నాయకులే కారణం అనే విషయం సీమాంద్రలోని ప్రతి ఒక్కరి తెలుసు.
అయితే రీసెంట్ గా.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఆడిన ‘‘నయవంచన ’’ నాటకమే ఇందుకు కారణం. ఈ నాటకంలో.. సీమాంద్ర నాయకులు ప్రేక్షక పాత్ర వహించటమే.. సీమాంద్రలో ఎగిసిపడుతున్న ఉద్యమానికి ఊపిరి. సీమాంద్ర ప్రజలు కంటే.. పదవులే.. మా ప్రాణం అని, కాంగ్రెస్ హైకమాండ్ కాళ్లకు మొక్కుతున్న.. సీమాంద్ర నాయకుల పై సమైక్యవాదులు ఉగిపోతున్నారు. తెలంగాణ నోట్ విషయం తెలిసిన కూడా .. తెలియనట్టు .. నటించిన సీమాంద్ర నాయకులపై.. సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు. సాయంత్రం వరకు తెలంగాణ నోట్ రెడీ కాలేదు, కేబీనెట్ ముందుకు రావటం కష్టమే అని దాగుడుమూతలు ఆడి, చివరకు టేబుల్ నోట్ అంటూ.. చర్చలు సాగించారు. ఫైనల్ గా .. తెలంగాణ నోట్ కేబినెట్ ఆమోదించిందని.. మీడియా ముందు.. పళ్లు వికిలించి చెప్పటమే.. సీమాంద్ర ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.
శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ఆజ్యం పోసింది ..కాంగ్రెస్ హైకమాండే. ఆక్రోశం, ఆవేశం, ఆవేదన, అన్ని కలిస్తే.. ఎలా ఉంటుందో .. విజయనగరం ప్రజలు.. పీసీసీ అధ్యక్షుడు.. బొత్స సత్యనారాయణ కు బంధువులకు, ఆయన ఆస్తులకు రుచి చూపించారు. అంతే ఒక్కసారి.. కేంద్రంలో చలనం వచ్చింది. ఒకేసారి విజయనగరం భారీ బలగాలను.. మోహరించి, కర్ప్యూ విధించి, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయులు ప్రయోగించి, విజయనగరం ప్రజల వీపులపై పోలీసుల లాఠీలు నాట్యం చేశాయి. అంటే.. సీమాంద్ర ప్రజల కంటే.. బొత్స ఆస్తులకే విలువ ఇచ్చిందనే పచ్చినిజం సీమాంద్ర ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ నాయకులే రకరకాలుగా.. మాట్లాడటం సమైక్యవాదులకు అనుమానం కలిగే విధంగా ఉండటం విశేషం.
బొత్స ఆస్తుల కంటే.. సీమాంద్ర ప్రజలు మనోబావాలు చాలా చీపుగా కనిపించాయా? సీమాంద్ర ప్రజలు అంటే.. కాంగ్రెస్ హైకమాండ్ కు అంత అలుసా? అనే అనుమానం సమైక్యవాదులకు కలుగుతుంది. దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులే.. మీడియా ముందుకు బొత్స లాంటి రాజకీయ నాయకులకు సపోర్టుగా మాట్లాడటం వింతంగా ఉందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. తెరపై ఆడించే తోలు బొమ్మలాట చూశాం గానీ, ప్రత్యక్షంగా.. సీమాంద్ర నాయకులనే.. తొలుబొమ్మలుగా చేసి... సీమాంద్ర ప్రజల ముందే ..కాంగ్రెస్ హైకమాండ్ ఆడించటం చూసి.. తెలుగు ప్రజలకు విచిత్రమైన అనుమానం కలుగుతుంది. తెలుగు ప్రజలు, తెలుగు జాతి, తెలుగు బాష, తెలుగు నేల, తెలుగు, అంటే.. కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ, ఇతర రాష్ట్రాలకు ఎంత అలుసు భావం ఉందో తెలిసిపోయిందని తెలుగుప్రజలు అవమానంతో.. కుమిలిపోతున్నారు. తెలుగు జాతి నాయకులు వల్లే.. ఈ రోజు ఇలా జరిగిందని తెలుగు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక ముందు ముందు కాంగ్రెస్ పార్టీ.. తెలుగు జాతి ఏం చేస్తుందో అనే అనుమానం తెలుగు ప్రజలకు కలుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more