సినీ నిర్మాత నట్టి కుమార్ రాష్ట్ర విభజన చిచ్చును టాలీవుడ్ లో పెట్టాడని .. ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రీసెంట్ నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు .. టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. టాలీవుడ్ పెద్దల మద్య విభజన చిచ్చును నట్టి కుమార్ రగిలించాడని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇటీవల కాలంలో నట్టి కుమార్ టాలీవుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో కనిపిస్తున్నారు. ఈ సారి ఏకంగా టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలను , దర్శకులను టార్గెట్ చేసుకోని... సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన దాసరి నారాయణ రావు, అలాగే ప్రముఖ నిర్మాతలు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, అశ్వినిదత్త్, మెగా స్టార్ చిరంజీవి లపై నట్టి కుమార్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయటం జరిగింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ సురేష్ బాబు, అల్లు అరవింద్, దాసరి నారాయణరావు, అశ్వినీదత్, చిరంజీవి ల కబంధహస్తాల్లో ఉందని సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్ పెను దూమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో సురేష్ బాబు, అల్లు అరవింద్, దాసరి నారాయణరావు, అశ్వినీదత్, చిరంజీవి వంటి వారి పలుకుబడే భారీగా నడుస్తోందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో ఒక్కొక్కరికి 20 ఇళ్లకు పైగా ఉన్నాయన్నారు. అందుకే కొత్త రాష్ట్రంలో ఇలాంటి బడా నిర్మాతలకు ఫిల్మ్ స్టూడియోల కోసం స్థలాలు ఇవ్వొద్దని చిన్న నిర్మాతలకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తాము మళ్లీ బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.
కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటుపై పెద్దలను చర్చలకు పిలవద్దని..ఇక్కడ మౌళిక వసతులున్న దాసరి, అల్లు అరవింద్, చిరంజీవి, సురేష్ బాబు లాంటి వారిని కమీటీల్లో ఉంచొద్దని నట్టికుమార్ తెలిపారు. 200 మంది చిన్న నిర్మాతలు, సాంకేతిక నిపుణులతోనే చర్చలు జరపాలని సూచించారు. చిన్న నిర్మాతల కోసం ప్రభుత్వమే స్టూడియో నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను వ్యాపార సముదాయాలుగా వాడుతున్న వారి భూములను లాక్కోవాలన్నారు. కొత్త రాజధానితో తమకు సంబంధం లేదని, వైజాగ్ సినీ క్యాపిటల్ అయితే సరిపోతుందన్నారు. హైదరాబాద్, విశాఖ ప్రాంతాల్లో తమ సినిమా షూటింగ్స్ జరుపుతున్నామని పేర్కొన్నారు. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలతో మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన టాలీవుడ్ రూట్ మ్యాప్ ఏ విధంగా మారుతుందోనని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. నట్టి కుమార్ కి దాసరి నారాయణ రావు శిష్యుడు అనే బిరుదు టాలీవుడ్ లో ఉన్న విషయం తెలిసిందే. నట్టి కుమార్ వ్యాఖ్యలతో.. సినిమా పై ఆధారపడి జీవించే ఫిలింనగర్ వాసులు ఆందోళన చేందుతున్నారు.
అయిన నట్టి కుమార్ ఈరోజు చిన్న నిర్మాత కావచ్చు.. రాబోయే భవిష్యత్తులో పెద్ద నిర్మాత కాకుండా.. చిన్న నిర్మాతగానే మిగిలిపోతాడా? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నస్థాయికి ఎదగాలని తపిస్తాడు.. కష్టపడతాడు.. అంత మాత్రన.. ఎదుటవారికి పై పెత్తనం చేస్తున్నారని అనుకుంటే పోరపాటే అవుతుంది నట్టికుమార్. ఆ ఐదుగురు ఈ స్థాయిలో ఉన్నరంటే.. దాని వెనుక ఉన్న శ్రమ గురించి ఒక్కసారి ఆలోచించు. రేపు నీ గురించి మరో చిన్న నిర్మాత ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తే నీవు ఎలా స్పందిస్తావు ఆలోచించు. ఇప్పటి వరకు నీ కష్టపడకుండానే నీవు ఈ నిర్మాత స్థాయికి రాగలివా? ఏదో.. ఎక్కడో, ఎప్పుడో.. ఒక సంఘటన జరిగిందని .. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచికాదు... నీకు నిజంగా కొత్త రాష్ట్రం కోరుకోవటంలో తప్పులేదు.. అంతేగానీ, ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ మరకలు లేకుండా.. బ్రతుకుతున్న.. కళామతల్లి బిడ్డలను వేరు చేయటం ఎంతవరకు సమాజసమో ఒక్కసారి ఆలోచించాలి నట్టి కుమార్. కళామతల్లి బిడ్డలు కలిసి ఉంటే.. తెలుగు తెరకు అందమని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more