మాజీ డిజిపి దినేష్ రెడ్డి తెలియని వారు ఎవరు ఉంటారు. ఒకవేళ ఎవరైన ఉన్న.. దినేష్ రెడ్డి రిటైర్డ్ అయిన తరువాత చేసిన రాద్దంతో అందరికి తెలిసిపోయింది. డిజీపి పదవి కోసం దినేష్ రెడ్డి తన సయశక్తుల కోర్టుల మీద పోరాటం చేసి అలసిపోయి, చివరకు చేదు అవమానంతో నెల్లూరు జిల్లా చేరుకున్నారు. అంటే ఆయన సొంత ఊరు నెల్లూరు ఉంది కాబట్టి అక్కడే చేరుకున్నారు. దినేష్ కుమార్ రిటైర్డ్ అయిన రెండో రోజు.. మీడియా ముందుకు వచ్చి తన గోడు వెలబోసుకున్న విషయం తెలిసిందే. అదీ కూడా.. పదవిలో ఉన్నప్పుడు..రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో తో సన్నిహితంగా, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా, ఎంత నమ్మకంగా పనిచేసిన దినేష్ రెడ్డి ఒక్కసారిగా సిఎంకు శత్రువుగా మారిపోయిడు. దినేష్ రెడ్డిలో పదవి పోవటంతో.. సీఎం కిరణ్ పై ఆరోపణాల బాణం వెయటం జరిగింది. కానీ చివరకు చిత్తూరు సార్ పై.. దినేష్ రెడ్డి వదిలిన బాణం కూడా పనిచెయ్యని విషయం అందరికి తెలిసిందే. అలా ఆరోజు దినేష్ రెడ్డి చెయ్యటానికి పెద్ద కారణం ఉందని కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి.
అసలు సిఎం కిరణ్ పై దినేష్ రెడ్డి బాణాన్ని వదిలింది ఎవరు తెలుసా? అక్రమాస్తుల కేసులో ఒక ఏడాది పాటు జైల్లో గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన వైఎస్ జగన్ అని సీఎం వర్గీలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల సీఎం అభిమానుల్లో పెద్ద ఎత్తున్న చర్చ జరిపితే అసలు విషయాలు బయటకు వచ్చాయని చిత్తూరు సార్ ప్యాన్స్ అంటున్నారు. ‘‘ ఒక్కసారి పదవి అనుభవించి వ్యక్తి.. మళ్లీ అదే అధికారం కావాలని కోరుకోవటం ’’ మనకు తెలుసు. దినేష్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. సీఎంను కలిసి .. తన పదవిని పొడిగించే ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. కానీ సీఎం దినేష్ రెడ్డికి ఒట్టి చేతులు చూపించి, నా వల్ల కాదు.. కోర్టుకు వెళ్లి ట్రై చేసుకోమని ఉచిత సలహా ఇవ్వటంతో.. దినేష్ రెడ్డి అమితమైన ఆశతో కోర్టు మెట్లు ఎక్కి, అవమనాంతో రిటైర్డ్ అవ్వటం జరిగింది. ఇక్కడే చిత్తూరు సార్ వల్లే నా పదవి పోయిందని బాధపడుతున్న దినేష్ రెడ్డికి, వైఎస్ జగన్ అభయ హస్తం ఇవ్వటం జరిగిందని చిత్తూరు సారు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
దినేష్ రెడ్డి రిటైర్డ్ అయిన తరువాత అమెరిక వెళ్లి బిజినెస్ చూసుకోవాలనే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. అయితే వైఎస్ జగన్ మాత్రం దినేష్ రెడ్డిలో రాజకీయ కోరికలు రేపాడు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశ ఉంటుందని జగన్ గ్యాంగ్ దినేష్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా వైఎస్ జగన్ రైడ్ హ్యాండ్ అయిన ఆడిటర్.. విజయసాయి రెడ్డిది, దినేష్ రెడ్డిది ఒకే ఊరు కావటమే ఇక్కడ విశేషం. దినేష్ రెడ్డికి కలిసి వచ్చిందని చిత్తూరు సారు అభిమానులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఇప్పటికే రాజకీయ పట్టు ఉన్న ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
అయితే మేకపాటిని నెల్లూరు నుంచి తప్పించి.. ఆ స్థానంలో దినేష్ రెడ్డికి అవకాశం ఇవ్వటానికి జగన్ పార్టీ సిద్దమైనట్లు సమాచారం. దినేష్ రెడ్డి దిశ ఇప్పుడు పొలిటికల్ వైపు మారుతుంది. ఆ బలం , ఆ అండతోనే.. దినేష్ రెడ్డి సీఎం కిరణ్ ఆరోపణ చేసినట్లుగా ఉందని సిఎం అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే 2014 ఎన్నికల్లో దినేష్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాడనే విషయం వైసీపీలో చర్చనీయాంశం అవుతుందని.. వైసీపీ కార్యకర్తలు చెవులుకొరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం, విజయసాయి రెడ్డి .. ఆడిటర్ బుర్ర, దినేష్ రెడ్డి మాజీ పోలీసు బుర్రలు కలిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. చూడాలంటే.. 2014 వరకు ఆగాల్సిందే...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more