ఇష్క్ సినిమా రివ్య్వూ....
నటీనటులు : నితిన్, నిత్యా మీనన్, అజయ్, నాగినీడు, సుధ, కాశీ విశ్వనాధ్ తదితరులు.
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం
సంగీతం : అనూప్ రూబెన్స్
డైలాగ్స్ & కో డైరక్టర్: రమేష్ సామల
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
యాక్షన్ : విజయ్
ఆర్ట్ : రాజీవ్ నాయర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాత : ఎమ్ విక్రమ్ గౌడ్
నితిన్ మరియు నిత్య మీనన్ నటించిన చిత్రం ‘ఇష్క్’ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై న్రిమించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. వరుస ప్లాపులతో ఉన్న నితిన్ సినిమా ఇలా ఉందో ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
రాహుల్ (నితిన్) ప్రాక్టికల్ జోకులు వేస్తూ జోవియల్ గా మరియు ఫ్రెండ్లీగా ఉండే కుర్రాడు. హైదరాబాదుకు వెళ్తున్న ప్రియ (నిత్య మీనన్) కలిసి ప్రేమలో పడతాడు. వారు హైదరాబదుకు వెళుతున్న విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోవడంతో అక్కడే ప్రియ మనసు కూడా గెలుచుకుంటాడు. హైదరాబాదు వెళ్ళేలోపు ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. ఇక్కడినుండి కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. ప్రియ అన్నయ్య శివ (అజయ్) కథలోకి వస్తాడు. గతంలో శివ కి రాహుల్ కి మధ్య వైరం ఉంటుంది. మరి శివ రాహుల్, ప్రియ ల రిలేషన్ కి ఎలా స్పందించాడు అనేది మిగతా చిత్ర కథ.
కళాకారుల పనితీరు :-
నటీనటుల్లో నితిన్ చాలా కాలం తర్వాత బాగా చేసాడు. అలాగే కాస్త ఒళ్లు చేసి నిండుగా ఉన్నాడు. నిత్యామీనన్ లోపలనుంచి నటన పొంగుకొస్తున్నట్లుగా స్క్రీన్ పై రెచ్చిపోయి చేసేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజయ్ డిఫెరెంట్ గా చేసాడు. ఇక అలీ,త్రాగుబోతు రమేష్,శ్రీనివాస రెడ్డి ఉన్నంతసేపు నవ్వించటానికి ట్రై చేసారు. హీరోయిన్ తండ్రిగా నాగినీడు ఓకే అనిపిస్తాడు. ఇక ఛాయాగ్రహణం గురించి కొత్తగా చెప్పుకునేదేమీలేదు. పిసి శ్రీరామ్ ని ఎంత కాస్ట్ అయినా భరించి ఎందుకు పెట్టుకోవాలనుకుంటారో ఈ సినిమా చూస్తే అర్దమవుతుంది. ఎడిటింగ్ మరింత షార్పుగా చేసి ఉండాల్సింది.
చివరగా:-
తిన్ మరియు నిత్య మీనన్ మధ్య కెమిస్ట్రీ చూడ ముచ్చటగా ఉంది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగులు సినిమాకి బాగా ప్లస్. కొన్ని లాజిక్ కు అందని సన్నివేశాలు, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటివి మైనస్. బి మరియు సి సెంటర్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఏ క్లాస్ ఆడియెన్స్ కి మాత్రం బాగా నచ్చుతుంది. ఫైనల్ గా కథ,కథనాలు రొటీన్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ తో చేసిన ట్రీట్ మెంట్ సినిమాకు నిలబెట్టింది. కేవలం యూత్ కే కాక ఫ్యామీలీలు సైతం ఎంజాయ్ చేసాలా ఉన్న ఈ సినిమా వారికి పడితే మంచి రేంజికి వెళుతుంది. మొత్తానికి నితిన్ కి చాలా కాలం తరువాత ఓ విజయం దక్కిందని చెప్పవచ్చు.