సినిమా పేరు : ‘రొటీన్ లవ్ స్టోరీ’
విడుదల తేదీ : 23.11.12
బ్యానర్ : వర్కింగ్ డ్రీమ్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : చాణక్య బూనేటి
తారాగణం : సందీప్ కిషన్, రెజీనా
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.75
పరిచయం :
వర్కింగ్ డ్రీమ్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం 'రొటీన్ లవ్‌స్టోరి'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హీరో సందీప్ కిషన్. ప్రస్థానం, స్నేహగీతం చిత్రాల తర్వాత తెలుగులో రెండేళ్ల గ్యాప్‌తో సందీప్ 'రొటీన్ లవ్‌స్టోరి' చేశాడు. ఇవాళ ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
స్టోరీ లైన్ :
కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం తమ ప్రేమ, పెళ్లికి అర్హత సాధిస్తుందా లేదా అనే ఒప్పందం మీద నడిచే కథ ఇది. సంజు (సందీప్ కిషన్) ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అదే కాలేజీలో చదివే తన క్లాస్ మెట్ తన్వి (రేజీన) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే కొంతకాలం పాటు వీరిరువురి మధ్య స్నేహం నడుస్తుంది. అనంతరం పెళ్లి ప్రపోజ్ చేసిన హీరోకి ఎదురయ్యే సమస్యలు, ఈ లవ్ గేమ్ లో అతను విజయం సాధించాడా లేదా అనేదే క్లుప్తంగా సినిమా.
అనుకూల ప్రతికూలాంశాలు :
ప్రజంట్ సొసైటీలో యూత్ ఆలోచనా ద్రుక్పదం ఎలా ఉంది అనేది ఉన్నదున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. తెరమీద హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రేజీన మధ్య కెమిస్ట్రీ పండింది. సందీప్ నటన, రేజీన అందం, అభినయం చూడచక్కగా కనిపించాయి. ప్రేమంటే ఎంజాయ్ మెంటే కాదు పెళ్ళయ్యాక కష్టాలు తెరపై చూపించారు.
తాగుబోతు రమేష్, ఎం.ఎస్. నారాయణ కామెడీ ట్రాక్ ఆకట్టుకోలేదు. ఇంకా, ప్రవీణ్. ఝాన్సీ, హేమ, రాళ్లపల్లి పాత్రలను కూడా అంతంత మాత్రమే. ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ లో గ్రాఫ్ దిగిపోతుంది.
సాంకేతిక విభాగం :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ విషయంలో మిక్కీ జే మేయర్ అలరించాడు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడి టేకింగ్ లో కొత్తదనం కనిపించింది.
బాటమ్ లైన్ :
యువతరాన్ని ఆకర్షించే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది.
...avnk