యువ హీరో నితిన్ జయం సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆ తర్వాత చాలా ప్లాపులు పలుకరించడంతో వెనకబడిపోయాడు. తాజాగా ‘ఇష్క్’ సినిమా తన స్టార్ ఇమేజ్ ను పెంచి మళ్లీ తన కెరీర్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాడు. అయితే వాస్తవానికి నితిన్ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట. కేవలం పవన్ కళ్యాన్ సినిమాలు చూసి హీరో అవ్వాలనే పిచ్చి ఎక్కువై ఇందులోకి దిగాడట. గురువారం రాత్రి జరిగిన ‘ఇష్క్’ ఆడియో ఫంక్షన్ లో నితిన్ మాట్లాడుతూ...‘‘నేను ఇంటర్ అయిపోగానే యూఎస్ వెళ్లిపోదామనుకున్నా, సరిగ్గా అప్పుడే ‘తొలిప్రేమ’ విడుదలైంది. నాకు స్వతహాగా సినిమాలంటే ఇష్టం. కానీ తొలి ప్రేమతో అది పిచ్చిగా మారింది. వారంరోజులు వరుసగా అదే సినిమా చూశాను.
ఓ రోజు దర్శకుడు కరుణాకరన్ మా ఇంటికి వచ్చాడు. నువ్వు బాగున్నావ్, నీతో సినిమా చేస్తా అన్నారు. అప్పటి నుంచి ఊహాలోకంలో విహరించే వాడ్ని. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత ఇష్టమంటే...నా బర్త్ డే వస్తే ఆ రోజంతా ఆయన ధరించిన టీషర్టులనే వేసుకుంటాను’’ అంటూ చెప్పుకొచ్చాడు నితిన్. నితిన్-నిత్య మీనన్ జంటగా కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇష్క్ సినిమా రూపొందుతోంది. విక్రమ్ కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more