‘ముంబయ్ నాకు కొత్త కాదు. పదేళ్లు అక్కడ పెరిగిన తర్వాత గోవా షిఫ్ట్ అయ్యాం. అక్కడే మోడలింగ్ మొదలుపెట్టాను’ అన్నారు ఇలియానా. దక్షిణాదిన పలు చిత్రాల్లో మెరిసిన ఈ అందం ఈ ఏడాది ఉత్తరాది తెరను మెరిపించబోతున్నారు. హిందీలో ఆమె చేసిన తొలి చిత్రం ‘బర్ఫీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇటీవలే తన పాత్రకు ఇలియానా డబ్బింగ్ చెప్పుకున్నారట. ఆమె వాయిస్ బాగుందని, ఇలియానా బాగా డబ్బింగ్ చెప్పిందని చిత్రదర్శకుడు అనురాగ్‌బసు అభినందిస్తున్నారు.
హిందీలో తనకిది తొలి చిత్రమే అయినా, ఈ నగరంతో తనకెంతో అనుబంధం ఉందని, ఈ గోవా బ్యూటీ ‘బర్ఫీ’ గురించి మరిన్ని విశేషాలు చెబుతూ ‘ఈ చిత్రంలో నన్ను తీసుకోవాలని అనురాగ్‌బసు అనుకున్నప్పుడు, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. దాదాపు గంటసేపు బసు నాతో మాట్లాడారు. ‘నేను వెతుకుతున్న శ్రుతి నీలో ఉంది. ఈ సినిమాకి నిన్ను ఫైనలైజ్ చేస్తున్నాను’ అని ఆయన చెప్పారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఒప్పుకోవాలా లేక వదులుకోవాలా? అనేది నాకు అర్థం కాలేదు. అందుకని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కొంచెం టైమ్ తీసుకున్నాను. ఇది మంచి, అది చెడు అని చెప్పడానికి నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేరు. అందుకని నా నిర్ణయాలు నేనే తీసుకోవాలి. కొంత తర్జన భర్జన తర్వాత ‘బర్ఫీ’ నాకు ప్లస్ అవుతుందనిపించింది.
లాంటి మంచి అవకాశం నాకు భవిష్యత్తులో రాదనే ఫీలింగ్ కలిగింది. దాంతో ఈ సినిమా ఒప్పుకున్నాను. 1970 నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. సినిమా లుక్ అందుకు తగ్గట్టుగా ఉంటుంది. ఒక డిఫరెంట్ మూవీని చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది’’ అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more