అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తారా జువ్వలాగా దూసుకొని వచ్చిన తార సమంతా. మొన్నటి వరకు తీరిక లేని కాల్షీట్లతో బిజీ షెడ్యూల్ తో ఉండటమే కాకుండా, ఈమె కోసం టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. కానీ పాపం సమంతాకి గత కొద్ది రోజుల నుండి టైం కలిసి రావడం లేదు. ఆ మధ్యన అనారోగ్యం పాలు కావడంతో తన షెడ్యూలు తారుమారై పెద్ద సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేవలం రెండంటె రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. మొన్నామధ్య రామ్ చరణ్ సినిమా నుండి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే సినిమా నుండి కూడా తప్పించి శ్రుతి హాసన్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంతను సడెన్ గా భారీ ప్రాజెక్టుల నుండి తప్పించడం వెనుక ఎవరి హస్తం అయినా ఉందా ? లేక అనారోగ్యం కారణంగా పెద్ద సినిమాలకు పెట్టిన ఇబ్బందులో ఏమో కానీ టాప్ ప్రొడ్యూసర్ బేనర్ నుండి వరుసగా రెండు సినిమాల నుండి తప్పించడం వెనుక కారణాలు బాగానే ఉన్నాయంటున్నారు. ఈనెల 23 నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకి సమంతా కాల్షీట్లు ఇచ్చినట్లు వార్తలు. దీని కారణంగానే ఈ సినిమా నుండి తప్పించినట్లు ఫిలిం జనాల టాక్. మరి హరీష్ శంకర్ దగ్గరి నుండి స్టేట్ మెంట్ వచ్చేదాకా ఏది నిజమో తెలియదు. ఒక వేళ సమంతాని కావాల్సుకొని తప్పిస్తే మాత్రం సమంతకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more