ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ జూదంలో తయారయింది. ఏ సినిమాకి డబ్బులు వస్తాయో, ఏ సినిమాకి పోతాయో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు పరిమితికి మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడం, ఒకవేళ ఆడితే... దానికి రెండు రెట్లు ఎక్కువ సంపాదించుకోవడం , లేక పోతే దివాలా తీయడం తెలుగు ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అనే సంస్థ నిర్మించిన ఢమరుకం సినిమా దెబ్బకు ఆ సంస్థనే మూత పడిందనే వార్తలు ఫిలిం నగర్ లో చెక్కర్లు కోడుతున్నాయి. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకి దాదాపుగా 45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీశారు. కానీ విడుదల టైంకి బయ్యర్లు లేక, పెట్టిన పెట్టుబడి రాక వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు విడుదల అయి, మంచి టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్స్ వీక్ గా ఉండటంతో, పెట్టిన పెట్టుబడి రాక దాదాపు 15 కోట్ల వరకు నష్టపోయారని అంటున్నారు. ఇండస్ట్రీలో చిన్న బ్యానర్ గా మొదలై పెద్ద బ్యానర్ గా ఎదిగిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ కి ఈ ఒక్క సినిమానే కాకుండా గతంలో నిర్మించిన రాజన్న, ఊసరవెల్లి, దడ చిత్రాలు కూడా బాక్సఫీసు వద్ద బోల్తా కోట్టడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇక చివరి ప్రయత్నంగా ఈ సినిమా తీసి, డబ్బులు సంపాదించుకుందామనుకున్న వారి ప్లాన్ బెడిసి కొట్టడంతో, ఆ సంస్థ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఇలాంటి నిర్మాణ సంస్థలు నష్టపోయి, అడ్రస్ లేకుండా పోయాయి. మరి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ మళ్ళీ కోలుకుంటుందో లేక, అడ్రస్ లేకుండా పోతుందో చూడాలి అంటున్నారు సినీమా జనాలు. మరి ఈ బేనర్ గురించి తెలుసుకున్న నిర్మాలు ఇకనైనా తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more