ప్రస్తుతం వాడి వేడిగా నడుస్తున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయాలు బయట పడటమే కాకుండా, ప్రముఖుల మీదకు ఈ ఫిక్సింగ్ ఆరోపణల గాలి వీస్తుంది. తాజాగా ఇండియా కెప్టెన్, చెన్నై జట్టు కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి కి ఈ ఫిక్సింగ్ భూతానికి సంబంధం ఉందా ? అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ఫిక్సింగ్ కి పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు, కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ సాక్షి జ్వాల అనే అమ్మాయికి ఖరీధైన ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ అమ్మాయిని శ్రీశాంత్ కి పరిచయం చేసింది ధోని భార్య సాక్షినే. వీరిద్దరు హోటల్ మేనేజ్ మెంట్ చేసేటప్పుడు క్లాస్ మేట్స్. ఐపీఎల్ 2 సందర్భంగా శ్రీశాంత్ కి సాక్షి జ్వాలాను పరిచయం చేయడంతో అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది. 6వ తేదిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ కోసం శ్రీశాంత్ జైపూర్ వచ్చాడు. అప్పుడు సాక్షి జాలా విందుకు రమ్మని ఇంటికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ తన ఖరీదైన్ ఫోన్‌ను సాక్షి జాలాకు ఇచ్చాడట. తన ఇంటికి విందుకు వచ్చిన శ్రీశాంత్ ఆ ఫోన్‌ను తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడని సాక్షి జాలా తండ్రి అతుల్ చెబుతున్నాడు. శ్రీశాంత్ ఫోన్ ఇచ్చినందుకు బదులుగా తాము పులి పోస్టర్‌ను శ్రీశాంత్‌కు బహుమతిగా ఇచ్చామని అతడు పోలీసులకు తెలిపాడు.
అయితే ఈ ఫిక్సింగ్ ఉదంతం బయట పడటంతో ధోని భార్య పై కూడా పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు సాక్షి ధోని బుకీలతో సంబంధం ఉన్న ఉన్నట్లుగా భావించి అరెస్టు అయిన బాలీవుడ్ నటుడు ధారా సింగ్ కొడుకు విందూ ధారా సింగ్ తో కలిసి ధోని భార్య మ్యాచ్ లు తిలకించిన ఫోటోలు బయటకు రావడంతో ధోని భార్యకి కూడా ఫిక్సింగ్ తో గానీ, బుకీలతో గానీ సంబంధం ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేస్తే పలు విషయాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more