నాడి పట్టుకోవటం తెలిస్తే సగం వైద్యం చేసేసినట్లేననేవారు పూర్వకాలం ఆయుర్వేద వైద్యులు.
అయితే తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవటం పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన దర్శకులకు కూడా వశం కావటం లేదు. దొరికినట్లే దొరికి పట్టుజారిపోతోంది. దానితో ప్రతి చిత్రమూ ఒక పరీక్షే అవుతోంది. అంత ఆలోచించి, కష్టపడి నిర్మించిన తర్వాత కూడా ప్రేక్షకులు ఆదరించకపోవటం జరుగుతోంది. ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టినా అది వృధా ప్రయాసగానే మారుతోంది. ప్రచారం వలన వస్తే మొదటి రోజు ఆదాయం వస్తుందేమో అంతే. ఆ తర్వాత సినిమా గురించిన ప్రేక్షకుల అభిప్రాయాలు చకచకా వ్యాపిస్తున్నాయి. దానితో సినిమా పడిపోవటమో, పైకి లేవటమో లేదా సగటు ఆటగా నిలిచిపోవటమో జరుగుతోంది.
మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 1 మీద వ్యతిరేక వ్యాఖ్యలు రావటంతో కొత్తదనాన్ని తెలుగు వాళ్ళు కోరుకోవటం లేదా అంటే అదీ సరికాదు. అయితే ఇక్కడ జరుగుతున్నదేమిటంటే, తెలుగు ప్రేక్షకులు తక్కువ బడ్జెట్ సినిమాలు చిన్న నటీనటులతో తయారయ్యే సినిమాలో కోరుకునేదాన్ని, లేదా ఇతర భాషా చిత్రాలలో కోరుకునేదాన్ని తెలుగు సినిమాల్లో అగ్ర నాయకులతో కోరుకోవటం లేదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ మిగిలిన స్టార్స్ ఎవరికీ లేదు మన దేశంలో. అయినా ఆయన సినిమా బాబా ని ఆదరించలేదు. కథ కొత్తదే కానీ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునేది వేరు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో పవన్ అభిమానులకు కావలసిన అన్ని అంశాలూ ఉండటమే దాని విజయానికి కారణం. అవేమీ లేకపోవటమే కొమరం పులి సినిమా ఫెయిలవటానికి కారణం.
ఇప్పుడు అందరి దృష్టీ రామ్ చరణ్ ఎవడు మీద ఉంది. అదీ బుడుంగుమని మునిగితే సంక్రాంతి శలవులను వృధా చేసుకున్నట్లే! అంతే కాదు చిన్న సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా థియేటర్లను అనవసరంగా ఆక్రమించుకున్నవాళ్ళూ అవుతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more