బాలీవుడ్ హాట్ శృంగార తార సన్నీ లియోన్ కు తెలుగులో బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అతడెవరో కాదు ‘హృదయ కాలేయం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అట. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదు కేవలం రీల్ కే పరిమితం. ఈ అమ్మడు నటించిన తొలి తెలుగు సినిమా ‘కరెంట్ తీగ’లో సంపూర్ణేష్ బాబు కూడా నటించాడు. ఈ సినిమాలో సన్నిది టీచర్ పాత్ర అట. కధలో భాగంగా సన్నీ - సంపూ ప్రేమించుకుంటారు అని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.
బర్నింగ్ స్టార్ తో బాలీవుడ్ భామ లవ్ ఎఫైర్ చాలా బాగా నడుస్తుందట. అంతేకాకుండా సన్నీ, సంపూ, మనోజ్ మద్య జరిగే కామెడి సీన్లు చాలా బాగుంటాయి అని అంటున్నారు. ఇవన్నీ చూడాలంటే నెలాఖరు వరకు ఆగక తప్పదు. ఎందుకంటే ఈనెల 31న ఈ సినిమా విడుదల అవుతోంది. మూవీలో సంపూర్ణేష్ బాబుతో పాటు వెన్నెల కిశోర్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ తదితర కమెడియన్లు ఉండటంతో.., కామెడి కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతోషం ఇచ్చే సినిమాగా చెప్తున్నారు.
జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్దమైనా... తుపాను వల్ల ఆగిపోయింది. మూవీలో సన్నీ లియోన్ ఐటం సాంగ్ ఫ్యాన్స్ ను ఊపేస్తుందని అంతా చెప్పుకుంటున్నారు. ఈ పాట వల్లే సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిందంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more