అనుష్క నటించిన ‘వేదం’ సినిమాలో అందం, అనుభవం గురించి అమ్మడు ఓ డైలాగ్ చెప్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కు అనుభవం పెరుగుతూ.., అందం తగ్గుతోందట. కొద్దికాలంగా వస్తున్న ఈ పుకార్లు ఈ మద్య మరీ పెరిగాయి. ‘లింగా’ సినిమా విడుదల తర్వాత ఎవర్నీఆపలేకపోతున్నాము. ప్రతీ ఒక్కరూ అనుష్క.., అందం తగ్గింది, లావు పెరిగింది అని కామెంట్లు చేస్తున్నారు. తిండి ప్రభావమో లేక ఇంకేదైనా కారణం ఉందో మనము అనకూడదు కానీ.., పాప నిజంగానే కాస్త ఒళ్లు చేసింది. ఈ విషయం గూగుల్ తల్లిని అడిగినా ఫొటోలతో సహా తేడాలను చూపిస్తుంది.
తొలుత వచ్చిన సినిమాలో.., ఆకట్టుకునే కళ్లు, నవ్వుతో అభిమానుల ధ్యానంను చెడగొట్టిందీ యోగా టీచర్. ‘బిల్లా’లో ఇచ్చిన ఎక్స్ పోజింగ్ లుక్ కు అందరూ ఫ్లాట్ అయ్యారు. అలా అమ్మడికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారినవారు అనుష్కలో కళ తగ్గింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మాటలు ఎలాగోలా అనుష్క చెవిన పడ్డాయి. అన్ని కరెక్టుగా మెయింటైన్ చేస్తున్నా ప్రేక్షకులు ఎందుకు సాటిస్ఫై కావటం లేదా అని ఈ భామ ఆలోచన మొదలు పెట్టిందట. డౌట్ వచ్చి ఒక సారి వెయిట్ వగైరా చెక్ చేసుకుని రియలైజ్ అయింది.
బరువు పెరగటంతో పాటు.., శరీరంలో స్వల్ప మార్పులు వచ్చినట్లు గమనించింది. వెంటనే తనకు తానే క్లాసులు చెప్పుకోవటం మొదలు పెట్టిందీ టీచర్. రోజూ యోగా, ఇతర బరువు తగ్గే మార్గాలను ప్రాక్టీస్ చేస్తోంది. తనను ఎవరైతే బాలేదు అనేందుకు నోరు తెరిచారో.., వాళ్ళ నోరు మూయించకుండా అలాగే తెరిచి అవాక్కయ్యేంతలా తయారవుతుందట ఈ బ్యూటి. ఏ డ్రెస్సు వేసినా తేడా రాకుండా పర్ ఫెక్షన్ కు డెఫినెషన్ గా తయారయ్యేందుకు పాట్లు పడుతోంది. ప్రేక్షకుల కామెంట్లను సీరియస్ గా తీసుకుని వారి కోసం శరీరాన్ని కరిగించుకుంటోన్న జేజమ్మను.., ఫ్యాన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూద్దాం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more