మూడుపదుల ముద్దుగుమ్మ నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా బాగానే రన్ చేస్తోంది. తెలుగులో తన జోరును తగ్గించిన ఈ అమ్మడు.. తమిళంలో మాత్రం యువహీరోల నుంచి స్టార్ హీరోలదాకా అందరితోనూ జతకడుతూ దూసుకుపోతోంది ఈ సెక్సీ భామ! పైగా ఈమె నటించిన సినిమాలన్నీ హిట్టవడంతో ఇంకా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమెకు మరో భారీ ఆఫర్ వరించింది. ఆ మూవీతో ఈమె తన మూడో ముచ్చటను తీర్చుకోనుందని కోలీవుడ్ సమాచారం!
ఒకే హీరో, ఒకే హీరోయిన్, ఒకే దర్శకుడు.. ఇలా ఒకే కాంబినేషన్లో మూడు సినిమాలు రావడం ప్రస్తుత రోజుల్లో చాలా అరుదు! మహా అయితే రెండు సినిమాలు రావొచ్చుగానీ హ్యాట్రిక్ అంటే కాస్త కష్టమే! అయితే.. తాజాగా అటువంటి అరుదైన హ్యాట్రిక్ కోలీవుడ్ లో చోటు చేసుకోబోతోంది. ‘థలా’ అజిత్, నయనతార, దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలవనుంది. మొదట్లో ఈ ముగ్గురి కాంబోలో ‘బిల్లా’ సినిమా వచ్చింది. అది మంచి విజయం సాధించి, నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆరంభం’ ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇప్పుడు వీళ్లు ముగ్గురు మూడోసారి కలిసి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి వివరాలు వెలువడికానున్నాయి.
ఇదిలావుండగా.. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మించే ఓ చిత్రం కోసం హీరో అజిత్ రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ముగియగానే ఆ హ్యాట్రిక్ కాంబో సెట్స్ పైకి వెళుతుంది. అలాగే.. ఇతర సినిమాలతో బిజీగా వున్న నయనతార.. ఆ మూవీ కోసం ఇప్పటినుంచే తన డేట్స్ ని అడ్జస్ట్ చేసే పనిలో నిమగ్నమైందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more